G20 Summit: ప్రపంచ నేతలతో 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్న ప్రధాని మోదీ!
జీ20 సదస్సు కోసం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేస్తుంది. అయితే జీ20 సదస్సుకు వస్తున్న ప్రపంచ నేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నాయని తెలిసింది.

జీ20 సదస్సు కోసం భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేస్తుంది. జీ 20 దేశాల అధినేతలు, ప్రతినిధుల బస కోసం ఢిల్లీలోని అత్యంత ఖరీదైన హోటళ్లను సిద్దం చేశారు. ఇప్పటికే కొందరు జీ20 సభ్య దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రతినిధులు ఢిల్లీకి విచ్చేశారు. మరింత మంది ప్రపంచ నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. అయితే జీ20 సదస్సుకు వస్తున్న ప్రపంచ నేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నాయని తెలిసింది.
సెప్టెంబర్ 8న ప్రధాని మోదీ.. మారిషస్, బంగ్లాదేశ్, యూఎస్‌ఏ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇద్దరూ శుక్రవారం సాయంత్రం ప్రధాని మోడీతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించనున్నారు. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసంలో ఈ ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి.
సెప్టెంబరు 9న జీ20 సమావేశాలలో పాల్గొనడంతో పాటు ప్రధానమంత్రి మోదీ.. యూకే, జపాన్, జర్మనీ, ఇటలీలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. బహిరంగ కార్యక్రమంలో కెనడా ప్రతినిధులతో మోదీ మాట్లాడనున్నారు. ఇక, కొమొరోస్, టర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, ఈయూ/ఈసీ, బ్రెజిల్, నైజీరియాలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.