భారత్ జీ 20 ప్రెసిడెన్సీతో ప్రపంచంలో మరోసారి తన ముద్ర వేయడానికి సిద్ధమైంది. జీ 20 అనేక మంచి పనులకు ఒక సముూర్తంగా మారనుంది. భారత్ వృద్ధి మార్గాన దూసుకెళ్లనుంది. పలు రంగాల్లో మరింతగా రాణించనుంది. ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఎదుర్కొనే సత్తా సమకూర్చుకుంది.
భారత్ జీ 20 ప్రెసిడెన్సీ కోసం టాప్ వరల్డ్ లీడర్లను ఆహ్వానిస్తున్నది. ప్రపంచ దేశాధినేతలు భారత్‌కు రానున్నారు. దీనికి భారత్ థీమ్.. ‘ఒకే జగతి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’. దీని ద్వారా వసుధైవ కుటుంబకం అనే నాగరికత కాన్సెప్ట్‌ను అందరిలో ఆలోచనకు తెస్తున్నది. ఈ ఆలోచనే మంచి భవిష్యత్ కోసం ప్రపంచం చేయాల్సి ఉన్నది. జీ 20 అధ్యక్షత చేపడుతున్న ఇండియాకు దానిదైన మంచి సమయం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
జీ 20 ప్రెసిడెన్సీ ద్వారా ప్రపంచదేశాల్లో భారత్ పట్ల నాటుకుపోయిన చిన్నచూపును తొలగించడం వీలవుతుంది. విశ్వగురువుగా బాధ్యతలు తీసుకోవడానికి బలమైన మధ్యతరగతి ప్రజానీకం కలిగిన భారత్ నేడు సిద్ధంగా ఉన్నది. అధికారం ఇప్పుడు భారత్ ఉండే దక్షిణ గోళం వైపు మొగ్గుచూపుతున్నది. అందుకే జీ 20 మరెన్నో మంచి కార్యాలకు ఒక సుముహూర్తం వంటిదని చెబుతున్నారు. భారత్ వృద్ధి మార్గాన దూసుకెళ్లనుంది. పలు రంగాల్లో మరింతగా రాణించనుంది. ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఎదుర్కొనే సత్తా సమకూర్చుకుంది.
20వ శతాబ్దం అసాధారణ పురోగతి చూసింది. కానీ, పశ్చిమ దేశాల అహంకారం దాన్ని నిష్ఫలం చేశాయి. రెండు ప్రపంచ యుద్ధాలు కోట్లమంది ప్రజల ప్రాణాలను తీసింది. ఆ తర్వాత ప్రపంచదేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. ఇప్పుడు పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభం వైపుగా వెళ్లుతున్నాయి. అందుకే చరిత్ర మనకో పాఠం చెబుతున్నది.
ప్రపంచ ఆర్థిక నిపుణుల అంచనాలు చూస్తే భారత్ దాని గతకాలపు ఘనతను మళ్లీ సాధించుకోనుంది. భారతీయులంతా సమైక్యంగా ఉండి అభివృద్ధి కోసం పని చేస్తే ఇది సాధ్యమవుతుంది. అమెరికా వంటి అగ్రరాజ్యంగా భారత్ ఎదగకుండా ఎవరూ ఆపలేరు. ప్రపంచ దేశాల పరిస్థితులను చూస్తే.. నేడు మనం శాంతియుత, సంపన్నమైన చోట నివసిస్తున్నాం. మన జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆయుష్సు కూడా పెరిగింది. మనలో చాలా మంది 2047 సంవత్సరాన్ని చూడగలం. 2047లో భరత్ అమెరికా, చైనాల సరసన గ్లోబల్ పవర్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: ఢిల్లీ మెట్రో సరసన ముంబై లోకల్ ట్రైన్.. సీటు కోసం పిచ్చికొట్టుడు కొట్టుకున్నారు.. వీడియో వైరల్..
చరిత్రలో మధ్యతరగతి లోకం ఎప్పుడూ లేదు. భవిష్యత్‌లో ఈ మధ్యతరగతి ప్రజలే కుబేరుల కంటే ఎక్కువ ప్రభావశీలంగా ఉంటారని అంచనా. అభివృద్ధి జరిగినా కొద్దీ ప్రజలు రోజువారీ విషయాలను పక్కనపెట్టి వారి పిల్లలు, మనవళ్ల ప్రయోజనాలు, చదువులపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇప్పుడు ఇండియాలో ఇదే జరుగుతున్నది.
అతిపెద్ద సవాలు ఏమిటంటే.. జాతీయవాద భావనలను మంచి మార్గం వైపు నడిపించాలి. దీని కోసం ఒక మతపరమైన గుర్తింపు కాదు.. పూర్తి ఫోకస్ అంతా అభివృద్ధి వైపు మళ్లించాలి. భారత్‌లో భిన్న సముదాయాల మధ్య ఘర్షణాపూరిత వాతావరణాన్ని తొలగించాల్సిన అవసరం ఉన్నది. భారత్ అభివృద్ధి మార్గంలో సుదీర్ఘ ప్రయాణం చేసింది. మౌళిక సదుపాయాలు, విద్యావకాశాలు, హెల్త్ కేర్ వంటి ఎన్నో లక్ష్యాలను సాధించింది. మరెన్నో సాధించాల్సి కూడా ఉ్నది. అయితే.. ఈ ప్రయాణం మహాత్మా గాంధీ స్వాతంత్ర్య కోసం చేపట్టిన సమరం ద్వారా మొదలైంది. జవహర్ లాల్ నెహ్రూ భారత మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. ఆ తర్వాత నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ హయాంలో పాకిస్తాన్ పై 1971 యుద్ధంలో గెలిచాం. ఈ యుద్ధం తర్వాతే ఆమె పటిష్ట నాయకురాలిగా ఎదిగారు. ఆమె హత్య తర్వాత రాజీవ్ గాంధీ కూడా ప్రభుత్వ కార్యాలయలను కంప్యూటరైజ్ చేయాలనే ఆలోచనతోనే టెలికాం విప్లవం జరిగింది.
పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరవడంతో ప్రధాన మలుపు వచ్చింది. అటల్ బిహారి వాజ్‌పేయి కాలంలో భారత్ అణు శక్తిగా ఎదిగింది. జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగింది. మోడీ హయాంలో అంతర్జాతీయ యవనికపై భారత్ ఒక బలమైన గుర్తింపును సంపాదించుకుంది.
పీఎం మోడీ అభివృద్ధి కోసం కఠిన, నిర్ణయాత్మక అడుగులు వేశారు. అవసరమైన మార్పుల కోసం ఆయన టీమ్ వెనుకాడలేదు. గత విజయాల పునాదులపై ఈ మార్పులు చేయడానికి వీలు చిక్కింది. ఇందుకు ఉదాహరణ.. భారత్ తన రక్షణ తయారీ యూనిట్‌ను దేశీయం చేశారు. అవసరమైన ఆయుధాలు, క్షిపణులను దేశీయంగా తయారు చేయడానికి అవకాశం చిక్కింది. అలాగే.. కొవిడ్ 19 వ్యాక్సిన్‌ను కూడా భారత్ అభివృద్ధి చేసుకోగలిగింది. ప్రధాని డిజిటల్ ఇండియా దార్శనికతపై ఇతర దేశాలు కూడా ప్రశంసలు కురిపించాయి.
ఈ నేపథ్యంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక దిగ్గజంగా ఎదుగుతున్నది.కానీ, ఈ కీలక సమయంలో నిర్ణయాలు భారత ప్రజలు కోసం తీసుకోవాలి.
---రచయిత అతీర్ ఖాన్
