ముంబై: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న భర్తను  భార్య వెంటాడి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది. నడిరోడ్డుపైనే భర్తతో ఆమె వాగ్వావాదానికి దిగింది. కారు బానెట్‌పైకి ఎక్కి కారును ముందుకు పోకుండా అడ్డుకొంది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు భార్యాభర్తలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

ముంబై పట్టణంలో నివాసం ఉంటే ఓ మహిళకు తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని అనుమానం వచ్చింది. భర్త ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారును ఆమెను మరో కారులో వెంబడించింది.

ముంబై పట్టణంలోని పెడెర్ రోడ్డులో భర్త కారుకు అడ్డుగా తన కారును ఆపింది. భర్త కారు పోకుండా అడ్డు నిలిచింది. కారు నుండి అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నించింది. 

కారు బానెట్ పైకి ఎక్కింది. తన కాలి చెప్పుతో అద్దంపై కొట్టింది. అయితే కారులో అప్పటికే మరో మహిళ కూడ ఉంది. దీంతో కారును కదలకుండా ఆమె అక్కడే అడ్డుపడింది.

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నుండి భర్త దిగగానే అతడిపై పిడిగుద్దులు కురిపించింది. భర్తను తన్నింది. ఇదే సమయంలో కారు ను డ్రైవింగ్ చేస్తూ మహిళ తప్పించుకొనే ప్రయత్నం చేసింది. ఆమెను కారు నుండి దింపి దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ గొడవతో రోడ్డుపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఈ ముగ్గురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ట్రాఫిక్ పోలీసులు ఈ ముగ్గురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాదు ట్రాఫిక్ కు ఇబ్బంది కల్గించిన మహిళకు పోలీసులు జరిమానాను విధించారు. ఈ ఘటన శనివారం నాడు జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఓ వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.