సోషల్ మీడియాలో బడ్జెట్ ప్రసంగంపై ఫన్నీ మీమ్స్ పోటెత్తాయి. ఒక వైపు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా మరికొందరు సోషల్ మీడియాలో మీమ్‌లతో బిజీగా గడిపారు. 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలకు ముందటి బడ్జెట్ కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం న్యూ ఇండియా అని పేర్కొనే అమృత కాలం తొలి బడ్జెట్ ఇదే అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒక వైపు సీరియస్‌గా బడ్జెట్ ప్రసంగం సాగుతుండగా.. కొందరేమో సోషల్ మీడియాలో మీమ్స్‌ పనిలో పడ్డారు. ముఖ్యంగా ట్విట్టర్‌లో బడ్జెట్ 2023 టాప్‌స్పాట్‌లోకి వెళ్లింది. చాలా మంది మీమ్‌లు పోస్టు చేశారు. ఇందులో ట్యాక్స్‌ విభాగం కోసం మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా చూశారు. పరిశ్రమల కోసం వ్యాపారులు, ఇతర రాయితీల కోసం వేచి చూశారు. కొందరు విద్యార్థులేమో బడ్జెట్ పీపీటీ గురించి ఇంట్రెస్టింగ్‌గా వీక్షించారు. ఇలా ఎవరి అవసరాల కోసం వారు బడ్జెట్ పై ఓ కన్నేశారు. ఈ సందర్భంగానే వారి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో మీమ్‌లు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. ఎవరి బాధలు వారివి అంటూ ఈ సందర్భంగా పలువురు వాటి కింద కామెంట్లు చేశారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

బడ్జెట్ ప్రసంగం మొదలు పెడుతూ ఇది అమృత కాలంలో మొదటి బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. మోడీ ప్రభుత్వం చెప్పే న్యూ ఇండియా సూత్రాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సాగు రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి అగ్రికల్చర్ యాక్సిలేటర్ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే, రైతు కేంద్రంగా పంట ప్రణాళిక, నిల్వలకు సహాయపడేలా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మిస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ ప్రభుత్వం ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. అవి.. సంఘటిత అభివృద్ధి, అంతిమ స్థానంలోని వారి వరకు అందుబాటులో ఉండటం, వ్యవసాయం- పెట్టుబడి, సంపూర్ణంగా శక్తి సామర్థ్యాలను వినియోగించడం, హరిత వృద్ధి, యువ శక్తి, ఆర్థిక రంగం అని ఆమె తెలిపారు.

సోషల్ మీడియాలో బడ్జెట్ పై ఫన్నీ మీమ్స్ పోటెత్తాయి. హిందీ సినిమాల సీన్‌లతో జోకులు పేల్చారు.