పెద్దకర్మ రోజు మిగిలిన ఆహారం తిని... 40 మందికి అస్వస్థత...
పెద్దకర్మ నాడు మిగిలిన ఆహారాన్ని మరునాడు ఉదయం తిన్న 40 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లో కలకలం రేపింది.

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో మిగిలిన ఆహారం తినడం వల్ల నలభై మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ వ్యక్తి చనిపోగా అంత్యక్రియల తరువాత భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం మిగిలిన ఆహారాన్ని తిన్న 40 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అధికారులు ఈ విషయం తెలిపారు. వారందరూ ఫుడ్ పాయిజనింగ్ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం రామానుజ్‌నగర్ డెవలప్‌మెంట్ బ్లాక్ పరిధిలోని విషున్‌పూర్ గ్రామంలో వీరంతా ఆహారం తిన్నారని సూరజ్‌పూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సిఎంహెచ్‌ఓ) డాక్టర్ ఆర్‌ఎస్ సింగ్ తెలిపారు.
వెంటనే అస్వస్థతకు గురవ్వడంతో వారందరినీ సూరజ్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, వారంతా ప్రమాదంనుంచి ఇప్పుడు బయటపడ్డారని వైద్యులు చెప్పారు. 'దస్‌గాత్ర' (ఒక వ్యక్తి మరణించిన తర్వాత పదవ రోజు చేసే కర్మ) కోసం శనివారం సాయంత్రం వండిన ఆహారం మిగిలిపోగా.. దాన్ని ఆదివారం ఉదయం తిన్నారని సీఎంహెచ్వో తెలిపారు.
ఆహారం తీసుకున్న రెండు-మూడు గంటల తర్వాత, మహిళలు, పిల్లలతో సహా 40 మంది ఫుడ్ పాయిజనింగ్ వంటి లక్షణాల బారిన పడ్డారు. దీంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాకని అధికారులు తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ప్రియుడు సెలవులను ఎంజాయ్ చేస్తే.. ప్రియురాలు పరీక్ష రాసింది.. అధికారులకు దొరికిపోవడంతో..
ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లో జరిగిన ఓ ఘటన షాకింగ్ కు గురిచేసింది. కొంతమంది స్నేహితులు కలిసి సరదాగా మద్యం సేవిస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన పులి.. ఆ స్నేహితులలోని ఓ 32 ఏళ్ల వ్యక్తిని ఈడ్చుకు పోయింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు మిగతా వారంతా భయాందోళనలతో పరుగులు పెట్టారు. అతడిని అడవిలోకి ఈడ్చుకెళ్లిన పులి సగం తిన్నది. ఈ సగం శరీరాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. శనివారం సాయంత్రం రాంనగర్ అడవిలో ఈ దారుణమైన ఘటన జరిగింది.
ఈ ఘటనలో ఖతారి ఈ గ్రామానికి చెందిన నఫీస్ అనే వ్యక్తి పులి బారిన పడ్డాడు. నఫీస్ స్నేహితులతో కలిసి మందు తాగడానికి శనివారం సాయంత్రం ఊరి బయట ఉన్న కాలువ దగ్గరికి వెళ్ళారు. కాలువ పక్కన ఉన్న బ్రిడ్జి పక్కన కూర్చుని స్నేహితులంతా కలిసి మందు తాగుతున్నారు. ఇంతలో అక్కడికి ఎక్కడి నుంచో ఒక పులి వచ్చింది. వారు ఆదమరచి ఉండటం గమనించింది. ఒక్క ఉదుటున నఫీస్ పై దాడి చేసింది. అతడిని నోట కరుచుకుని సమీపంలోని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు స్నేహితులకు… అంతలోనే జరిగిందేమిటో అర్థమై భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారు వెంటనే అలర్ట్ అయ్యి నఫీస్ కోసం బ్రిడ్జి చుట్టుపక్కల గాలించారు. ఆదివారం ఉదయం వారు కూర్చుని మందు తాగిన ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరంలో నఫీస్ సగం మృతదేహం లభించింది. దీంతో పులి అతడిని సగం తిని వదిలేసిందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతమంతా కార్బెట్ టైగర్ రిజర్వ్ ఏరియా అని.. పులులు యదేచ్ఛగా ఇక్కడ సంచరిస్తుంటాయి అని.. తెలిపారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని.. ఈ ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించారు.