Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడు సెలవులను ఎంజాయ్ చేస్తే.. ప్రియురాలు పరీక్ష రాసింది.. అధికారులకు దొరికిపోవడంతో..

ఓ యువకుడు సెలవులను ఏంజాయ్ చేస్తూ టూర్ లో ఉండగా.. ప్రియురాలు అతడికి బదులుగా పరీక్ష రాసింది. కానీ ఈ విషయం అధికారులకు తెలియడంతో ఆమె పట్టుబడింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. 

If the boyfriend enjoys the holidays.. the girlfriend wrote the exam.. when the authorities found it..
Author
First Published Dec 26, 2022, 11:49 AM IST

ప్రియుడికి బదులుగా ప్రియురాలు పరీక్ష రాసి అధికారులకు దొరికిపోయిన ఘటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. ఆమె భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయి. బీకాం డిగ్రీని రద్దు చేయాలని యూనివర్సిటీ ఫెయిర్ అసెస్మెంట్ అండ్ కన్సల్టేటివ్ టీమ్ (ఫ్యాక్ట్) చేసిన సిఫారసును వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (వీఎన్ఎస్జీయూ) సిండికేట్ అంగీకరిస్తే ఆ యువతి తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్శిటీ ( VNSGU)లో బీకామ్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థికి బదులుగా అతడి ప్రియురాలు పరీక్ష రాసింది. అయితే ఈ విషయం అధికారులకు తెలిసింది. ఆ పరీక్ష ఉన్న రోజు అతడు ఉత్తరాఖండ్‌లో సెలవుల్లో ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. దీంతో అసలైన అభ్యర్థికి బదులు పరీక్ష రాసిన యువతి సొంత డిగ్రీని రద్దు చేయడమే ఆమెకు విధించే కఠినమైన శిక్ష అని ఫ్యాక్ట్ కమిటీ స్నేహాల్ జోషి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కి తెలిపారు. అసలైన అభ్యర్థి కూడా మూడేళ్ల పాటు పరీక్షకు హాజరుకాకుండా నిషేధం విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

సాధారణంగా గతంలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు డమ్మీలుగా కూర్చుంటారని ఆ కాలేజికి చెందిన ఓ లెక్చరర్ తెలిపారు. అయితే ఈ యువతి తన ప్రియుడికి బదులుగా ఆమె పరీక్ష రాయడానికి సిద్ధమైంది. హాల్ టికెట్ లో తన ప్రియుడి ఫొటో బదులుగా తన ఫొటోను ఉంచింది. అధికారులకు దొరకకుండా ఉండటానికి పేరులో చిన్న మార్పులు చేసుకుంది. తరువాత దానిని కంప్యూటర్ ద్వారా ప్రింట్ తీసుకుంది. అయితే ప్రతీ రోజు ఒక ఇన్విజిలేటర్ మారుతూ ఉంటారు. వారికి విద్యార్థులందరూ వ్యక్తిగతం తెలియదు. వారు కేవలం హాల్ టికెట్ ను తనిఖీ చేస్తారు. అయితే ఈ యువతి పరీక్ష రాసిన రోజు ఆ హాల్ లో ఉండే మిగితా విద్యార్థులకు అనుమానం వచ్చింది. ఆ యువతి కూర్చున్న స్థానంలో ప్రతీ రోజు ఒక యువకుడు కూర్చునేవాడని గుర్తించారు. దీంతో వారు ఈ విషయాన్ని సంబంధింత సూపర్ వైజర్ కు తెలియజేశారు. దీంతో వారు వచ్చి హాల్ టిక్కెట్ ను క్షుణ్ణంగా పరిశీలించడంతో ఆమె పట్టుబడింది. 

ఈ ఏడాది అక్టోబరులో జరిగిన టైవైబీకాం పరీక్షలో ఆ యువతి పట్టుబడింది. దీంతో అప్పటి నుంచి ఫ్యాక్ట్ కమిటీ విచారణ చేపట్టి తాజాగా దానిని నివేదించింది. వీఎన్ఎస్ జీయూ సిండికేట్‌కు శిక్షను సిఫార్సు చేసింది. ఈ విచారణలో పట్టుబడిన యువతి, పరీక్ష రాయాల్సిన యువకుడు స్నేహితులని తాము కనుగొన్నామని కమిటీ పేర్కొంది. 

ఆ యువతి చేసిన పని ఆమె తల్లిదండ్రులకు తెలియదని ఓ అధికారి తెలిపారు. మహిళ పట్టుబడిన తర్వాత అసలైన విద్యార్థిని కమిటీ పిలిపించింది. ఆ సమయంలో ఉత్తరాఖండ్ లో తాను టూర్ లో ఉన్నట్టు తమకు తెలిపినట్టు ఫ్యాక్ట్ కమిటీలోని సభ్యుడు తెలిపారు. అతడు బీకాం రెగ్యులర్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడని పేర్కొన్నారు. అందుకే అతడికి బదులుగా ఆ యువతి పరీక్ష రాసిందని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios