కరోనా దెబ్బ: సాయం కోసం 70 కి.మీ సైకిల్‌పై దివ్యాంగుడు

తనకు సహాయం చేయాలని కోరేందుకు  ఓ దివ్యాంగుడైన వృద్ధుడు 70  కి.మీ దూరం సైకిల్‌పై ప్రయాణం చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

Frustrated by official apathy, senior citizen pedals 70 km to get grievance redressed

చెన్నై:తనకు సహాయం చేయాలని కోరేందుకు  ఓ దివ్యాంగుడైన వృద్ధుడు 70  కి.మీ దూరం సైకిల్‌పై ప్రయాణం చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

లాక్‌డౌన్‌తో జీవనాధారం కోల్పోయిన నటేశన్ అనే 73 ఏళ్ల దివ్యాంగుడిది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని ఏనానల్లూరు గ్రామం.ఆయన వ్యవసాయకూలీగా పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ పనులు లేని సమయంలో సైకిల్ పై ముగ్గు పిండి విక్రయించేవాడు.

also read:కరోనా నుండి కోలుకొన్న యువతిని ఆటోలో ఇంటికి చేర్చిన మహిళ

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో తనకు ఉపాధి లేకుండా పోయిందని నటేశన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.దీంతో తనకు ఉపాధి కల్పించాలని కోరేందుకు నటేశన్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించేందుకు సైకిల్ పై 70 కి.మీ దూరం ప్రయాణించాడు.

తన గ్రామం నుండి కలెక్టరేట్ కార్యాలయానికి  సోమవారం నాడు తెల్లవారుజామున 3 గంటలకు సైకిల్ పై బయలుదేరాడు. ఉదయం 11 గంటలకు ఆయన తంజావూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆయన చేరుకొన్నాడు. 

కలెక్టరేట్ కార్యాలయంలో భద్రతా విధుల్లో ఉన్న ఎస్ఐ సుకుమార్ జోక్యం చేసుకొని నటేశన్ ను కలెక్టరేట్ కార్యాలయంలోని దివ్యాంగుల సంక్షేమ శాఖాధికారి వద్దకు తీసుకెళ్లారు. వైద్యుడి నుండి సర్టిఫికెట్ తీసుకొని తహాసీల్దార్ కార్యాలయంలో అందిస్తే సరిపోతోందని అధికారి సూచించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios