Asianet News TeluguAsianet News Telugu

కరోనా నుండి కోలుకొన్న యువతిని ఆటోలో ఇంటికి చేర్చిన మహిళ

కరోనా సోకిందని తెలిస్తేనే అతని వైపు చూసేందుకు కూడ భయపడుతున్న రోజులు. కానీ కరోనా నుండి కోలుకొన్న ఓ వ్యక్తిని ఓ మహిళా  ఆటో డ్రైవర్ తన ఆటోలో  140 కిలోమీటర్ల దూరం ఆటోలో తీసుకెళ్లింది. మహిళా డ్రైవర్ ను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.

140 km 8 hours how a woman drove a Covid-19 survivor home when no one else would
Author
Manipur, First Published Jul 6, 2020, 10:25 PM IST


ఇంఫాల్: కరోనా సోకిందని తెలిస్తేనే అతని వైపు చూసేందుకు కూడ భయపడుతున్న రోజులు. కానీ కరోనా నుండి కోలుకొన్న ఓ వ్యక్తిని ఓ మహిళా  ఆటో డ్రైవర్ తన ఆటోలో  140 కిలోమీటర్ల దూరం ఆటోలో తీసుకెళ్లింది. మహిళా డ్రైవర్ ను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.

కోల్‌కత్తాకు చెందిన సోమిచాన్ చితుంగ్ అనే 22 ఏళ్ల యువతి మే మాసంలో  మణిపూర్ కు వచ్చింది. ఆమెకు కరోనా సోకింది. దీంతో జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఆమెకి చికిత్స అందించారు. 14 రోజుల చికిత్స తర్వాత మే 31న ఆమెకి కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో వైద్యులు చితుంగ్ ని డిశ్చార్జ్  చేశారు.

దీంతో ఆమె స్వగ్రామం కామ్‌జాంగ్ వరకు  అంబులెన్స్‌ ఏర్పాటు చేయడానికి ఆస్పత్రి సిబ్బంది అంగీకరించలేదు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలిపింది. ప్రైవేట్ వాహనం ఏర్పాటు చేసేందుకు  కరోనా నుండి కోలుకొన్న పేషెంట్ ను తీసుకొచ్చేందుకు ప్రైవేట్ వాహనదారులు ఎవరూ కూడ  ముందుకు రాలేదు. 

ఈ విషయం తెలిసిన మహిళా ఆటో డ్రైవర్ లైబికి తెలిసింది. చితుంగ్ ను ఇంటికి చేర్చేందుకు ఆమె ముందుకు వచ్చింది. తాను చితుంగ్ ను ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. చితుంగ్ కుటుంబసభ్యులు ఈ మాటలను సీరియస్ గా తీసుకోలేదు. తనకు స్వంత ఆటో ఉందని, దాదాపుగా పదేళ్ల నుండి ఆటో నడుపుతున్నానని వారికి తెలిపింది.

చితుంగ్ ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తానని లైబి నమ్మించింది. ఈ ఏడాది మే 31 వ తేదీ రాత్రి చితుంగ్ ను ఆటోలో తీసుకొని లైబి బయలుదేరింది. జూన్ 1 వ తేదీన ప్రయాణం ముగిసింది. సుమారు 140 కిలోమీటర్ల దూరం 8 గంటల్లో చేరుకొన్నారు. చితుంగ్ కుటుంబం నుండి రూ. 5 వేలు తీసుకొన్నట్టుగా లైబి తెలిపారు.  వీరిద్దరితో పాటు లైబి భర్త రాజేంద్ర కూడ ఉన్నారు. 

పొగమంచు భారీగా కురుస్తున్న సమయంలో ఈ ప్రయాణం సాగించినట్టుగా లైబి తెలిపారు. ఆమె నడుపుతున్న ఆటో హెడ్ లైట్ సరిగా పనిచేయలేదని ఆమె గుర్తు చేసుకొన్నారు. లైబి ధైర్యంగా తన కూతురిని ఇంటికి చేర్చడంపై ఆమె కుటుంబసభ్యులు అభినందిస్తున్నారు. 

ఈ విషయాన్ని తెలుసుకొన్న మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ కూడ లైబిని ప్రశంసలతో ముంచెత్తారు. లైబీకి సీఎం రూ.1.10 లక్షలు ఇస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. ఇంఫా నుండి కమ్ జోంగ్ వరకు చితుంగ్ ను తీసుకెళ్లిన లైబి చేసిన సేవ అభినందనీయమన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios