Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్: సిద్దూ, డీకేల మధ్య కొత్త యుద్దం.. రాజస్తాన్‌లో 56 వర్సెస్ 56..

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

From the india gate new war between Siddaramaiah and dks and 56 vs 56 in Rajasthan and more ksm
Author
First Published Oct 8, 2023, 11:16 AM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఎటువంటి నియమాలు లేవు.. 
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్ మధ్య కొత్త యుద్ధం మొదలైంది. కొత్త బార్లు లేదా మద్యం దుకాణాలకు సిద్దరామయ్య వ్యతిరేకం కాగా.. ప్రతి గ్రామంలో ఒక బార్ ఏర్పాటు చేస్తామని డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. దీంతో కర్ణాటకలో ‘‘మాకు గుంటలు కావాలి’’అనే విచిత్రమైన నినాదం వినిపిస్తోంది. మరిన్ని బార్లు తెరుస్తానన్న శివకుమార్ హామీని అపహాస్యం చేయడమే లక్ష్యంగా ఈ నినాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. కొత్త బార్ల నుంచి తాగి తర్వాత వారు గుంటలో పడిపోవాలి అనేది ఆ నినాదం చేస్తున్న ప్రజల (సిద్దారామయ్య మద్దతుదారుల) సందేశం.

స్పైసీ నిరసన.. 
సాధారణంగా కొందరు రాజకీయ నాయకులు బహిరంగ నిరసనల వద్ద కెమెరామెన్‌ల పట్ల విసుగు చెందుతూ ఉంటారు. అయితే లైమ్‌లైట్‌ని పట్టుకోవడంలో పేరుగాంచిన కొందరు వ్యక్తులు మాత్రం ఔత్సాహిక కెమెరామెన్‌ల దృష్టిని ఆకర్షించే స్టంట్‌లతో ముందుకు వస్తుంటారు. అలాంటి వాటికి పేరుగాంచిన ఈ వ్యక్తి.. చెప్పులు లేకుండా నడవడం, పేడతో స్నానం చేయడం, బురద తినడం.. ఇలా ఎల్లప్పుడూ ‘‘సృజనాత్మకతను’’ ఆవిష్కరించారు. 

ఇటీవలి కావేరి జలవివాదంపై బంద్ సమయంలో ఆ నాయకుడు మరొక ప్రత్యేకమైన నిరసన వ్యూహాన్ని ప్రయత్నించారు. తన నిరసన అందరి దృష్టిని ఆకర్షించాలనే వ్యూహంతో ఆయన కారంగా ఉండే మిరపకాయలను నమలాలని నిర్ణయించుకున్నారు. ఎగతాళి చేస్తున్న గుంపు మరిన్ని మిరపకాయలు తినమని ఆయనను ప్రోత్సహించింది. 

అయితే అంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత భరించలేని వేడి అనుభూతి చెందారు. తన బాధను తగ్గించుకోవడానికి తెలిసిన అన్ని ఇంటి మందులు, దేశీయ నివారణలు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎటువంటి ఉపశమనం లభించకపోవడంతో కడుపు లోపల మండుతున్న మసాలా మంటలను ఆర్పడానికి ఆయనను ఆసుపత్రికి తరలించవలసి వచ్చింది.

56 వర్సెస్ 56
ఇది రాజస్థాన్‌లో కొత్త ఎన్నికల నినాదం. ఈ పోల్ కోడ్‌ను ఎవరైనా అర్థం చేసుకుంటే.. రాబోయే ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మధ్య ప్రత్యక్ష పోరు అని అర్థం. ప్రధాని మోదీ 56 అంగుళాలు ఛాతీ నినాదానికి సరిపోయేలా.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్‌లో మరో మూడు జిల్లాలను ఏర్పాటు చేసి  మొత్తం జిల్లాల సంఖ్యను 56కి తీసుకెళ్లింది. 

దీంతో 56 వర్సెస్ 56 సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చర్య స్పష్టంగా రెండు అంశాలను నొక్కి చెబుతుంది.. ఒకటి బీజేపీకి మస్కట్‌గా ఉన్న  ప్రధాని మోదీని  ఎలా ఎదుర్కొవాలో కాంగ్రెస్‌కి ఇంకా అవగాహన లేదు.. మరొకటి ఇలాంటి కాస్మోటిక్ బిడ్స్ తప్ప బీజేపీకి వ్యతిరేకంగా ప్రదర్శించడానికి గెహ్లాట్ ప్రభుత్వానికి అస్త్రాలు లేవు. అయితే ఇలాంటి భౌగోళిక జిమ్మిక్కుల ద్వారా కాంగ్రెస్ చరిత్ర సృష్టించగలదా అనేది చర్చనీయాంశంగా మిగిలిపోయింది.

మేడమ్ మ్యూట్ చేయబడ్డారు.. 
ఒక నేత వారి జూనియర్ల చేత విస్మరించబడటం అనేది రాజకీయ పార్టీలో వారి అసంబద్ధతకు స్పష్టమైన సూచన. అయితే జూనియర్ నాయకులు.. బ్రెడ్‌లో ఏ వైపు వెన్న వేయాలనేది బాగా తెలుసు. బీజేపీకి చెందిన ఓ ప్రముఖ మహిళా నాయకురాలు.. పాపం ఇప్పుడిప్పుడే ఈ పాత వాస్తవాన్ని గుర్తిస్తున్నారు. గతంలో ఆమె సూచనల మేరకు రాజస్థాన్‌లో బీజేపీ రాజకీయాల్లో టెక్టోనిక్ మార్పులు చోటుచేసుకున్న సందర్భం ఉంది. కానీ ఇప్పుడు.. ఆమెను లాంఛనప్రాయంగా మాత్రమే పెద్ద ఈవెంట్‌లకు ఆహ్వానిస్తున్నారు. ఈవెంట్లలో ఆమెకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. 

ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో వేదికపై ఉన్న నాయకులు.. వారిలో ఒక నాయకుడి ఫోన్ మోగినప్పుడు అందులో ఆమె పేరు కనిపించడం చూశారు. అప్పట్లో అలాంటి కాల్ వస్తే.. రాష్ట్రంలో ఆమెకున్న ప్రాధాన్యత దృష్ట్యా సమాధానం చెప్పడానికి ముందే ఆ నాయకుడు కుర్చీలో నుంచి లేచి నిల్చుండేవారు. కానీ ఇప్పుడు ఆమె పదే పదే డయల్ చేసినా ఆ నాయకుడు పట్టించుకోలేదు. సెల్ ఫోన్‌ను కూడా ఆఫ్ చేశారు. అయితే ఇలాంటి ప్రవర్తన వచ్చే ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టేందుకు తుఫానులకు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కామ్రేడ్ విమర్శలు..
నిష్కళంకమైన అర్హతలు కలిగిన అతికొద్ది మంది రాజకీయ నాయకులలో సీపీఎం నేత జి సుధాకరన్‌ కూడా ఒకరు. అందుకే పినరయి  విజయన్ తొలి  ప్రభుత్వంలో పీడబ్ల్యూడీ మంత్రిగా మంచి ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జి సుధాకరన్‌ను పక్కన పెట్టడం ఆయనకు పట్టు కలిగిన ప్రాంతంలో పార్టీలోని గ్రూప్‌ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. 

ఏషియానెట్ న్యూస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుధాకరన్.. కరివన్నూరు సహకార బ్యాంకు కుంభకోణాన్ని మొగ్గలోనే తుంచేయకపోవడం సీపీఎం వైఫల్యమని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే ఈ కుంభకోణంలో సీపీఎం సీనియర్ నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించిన వేళ.. సుధాకరన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఒకరిద్దరు నేతలను ఈ కేసులో ఈడీ అరెస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఈడీ దర్యాప్తు ప్రతీకార రాజకీయాల్లో భాగమని సీపీఎం చెబుతుండగా.. సుధాకరన్ మాత్రం విచారణలో మెరిట్ ఉందని, ‘‘ఈడీని ఆపలేం’’ అని అన్నారు. అదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను నిష్క్రియంగా ఉన్నానని పార్టీకి నివేదించిన సీనియర్ నాయకుడు ఎలమరం కరీమ్‌పై కూడా సుధాకరన్ మండిపడ్డారు. 

ఇక, సుధాకరన్ హయాంలో పీడబ్ల్యూడీ శాఖను సరైన దారిలో నడిపించినప్పటికీ సీపీఎం ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు టికెట్ నిరాకరించింది. ఇక, తమ విధానానికి వ్యతిరేకంగా ఎవరైనా వెళితే కఠిన క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించే సీపీఎం పార్టీ.. సుధాకరన్ బహిరంగ ప్రకటనపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios