Asianet News TeluguAsianet News Telugu

ఫ్రమ్ ది ఇండియా గేట్‌: అందమైన ముఖం కోసం వేట, చోటే నేతాజీ జైలు సందర్శనలతో ఇబ్బందులు..

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తెరవెనక జరుగుతున్న కొన్ని సంగతులను తాజా ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.. 

From The India Gate from Hunt for a beautiful face buzz in Rajasthan BJP to Chote Netaji jails visiting
Author
First Published Jan 2, 2023, 6:05 PM IST

దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అందమైన ముఖం కోసం వేట..
రాజస్థాన్‌లో బీజేపీలో జోరుగా ఒక చర్చ సాగుతుంది. రాజస్థాన్‌కు చెందిన బీజేపీ జాతీయ స్థాయి నేత ఒకరు వేసిన అంచనా.. ఇప్పుడు పార్టీలో ఆ అందమైన ముఖం ఎవరిదనే చర్చను ప్రేరేపించింది. ఇంతకీ అదేమిటంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయ్యే ముఖం అందంగా ఉంటుందని ఆ నేత అన్నారు. అప్పటి నుంచి అది ఎవరనే చర్చ సాగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా స్థానంలో కొత్త ముఖం వస్తుందా? అని కొందరు నేతలు వారి రహస్య సంభాషణల్లో ప్రస్తావిస్తున్నారు. లేకపోతే.. ఆ స్థానానికి రాజస్థాన్ రాజకుటుంబానికి చెందిన మరొకరిగా అవకాశం దక్కుతుందా? అనేది కూడా వారు మాట్లాడుకుంటున్నారు. 

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘‘అందమైన ముఖం’’ ఎవరిదా? అనే విషయంలో రాష్ట్రంలో పార్టీ నాయకులకు ఎవరి ఊహాలు వారికి  ఉన్నాయి. హాస్యాస్పదంగా.. ఇందుకు సంబంధించిన చర్చ ప్రారంభమైనప్పటీ నుంచి యువరాణికి చాలా అభినందన సందేశాలు వస్తున్నాయి.

ఫేస్ ఆఫ్.. 
రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదానికి  చోటిచ్చింది. ఈ వివాదం  తెరపైకి వచ్చినప్పటీ నుంచి పార్టీలోని చాలా మంది నాయకులు.. వారి సోషల్ మీడియా పేజీలకు దూరంగా ఉంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల కాంగ్రెస్‌ నేతలకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఫొటో తప్పు చేశాడనే ఆరోపణలతో బయటికి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో లీక్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ ప్రశ్నపత్రం లీక్ కావడం వెనుక ప్రధాన సూత్రధారులలో ఆయన ఒకరు.

ఈ కేసులో 60 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ సూత్రధారులిద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఒకరికి కాంగ్రెస్ అగ్రనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నిందితులకు సంబంధించిన అనేక ఫోటోలు బయటికి రావడంతో.. కాంగ్రెస్‌పై అక్కడి ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడిని ఉధృతం చేసింది. 

కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ‘‘యే రిష్తా క్యా కెహ్లతా హై’’ (ఈ సంబంధాన్ని ఏమంటారు) ప్రచారాన్ని కూడా బీజేపీ నేతలు ప్రారంభించారు. నిందితులతో 15 మందికి పైగా నేతలు ఫోజులు ఇస్తున్న ఫోటోలు బయటికి రావడంతో.. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా మారాయి.


సెల్ కష్టాలు.. 
యూపీలో చోటే నేతాజీ (అఖిలేష్ యాదవ్)‌కు ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల అఖిలేష్ తరుచుగా రాష్ట్రంలోని పలు జైళ్లను సందర్శిస్తున్నారు. ఎందుకంటే.. చోటే నేతాజీ పార్టీకి చెందిన కొందరు నేతలు గతంలో చేసిన నేరాలకు సంబంధించి ప్రస్తుతం జైళ్లలో ఉన్నారు. అయితే వారితో మంచి రిలేషన్ కొనసాగించడం, పార్టీ మద్దతు ఉందనే సంకేతం పంపడం కోసం.. అఖిలేష్ వారు ఉంటున్న జైళ్లకు వెళ్లి కలుసుకుంటున్నారు. అయితే అఖిలేష్ పర్యటనలు జైలులో ఉన్నటువంటి నాయకులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.  

చోటే నేతాజీ జైలులో ఒకరిని సందర్శించిన వెంటనే.. ఆ ఖైదీ అధికారులకు టార్గెట్ అవుతుండటమే ఇందుకు కారణం. ఇటీవల కాన్పూర్ జైలులో ఉన్న తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అఖిలేష్ కలిశారు. అయితే ఆ మరుసటి రోజే ఆ ఎమ్మెల్యేని మరో జైలుకు తరలించారు. అయితే దీనిపై ఆ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ అతని తరలింపు ఆర్డర్ త్వరగా జారీ చేయబడింది. 

మరోవైపు ఇటీవల అఖిలేష్ జైలులో ఒక మాజీ ఎమ్మెల్యేను కూడా కలిశారని.. ఆయనను మరో జైలుకు తరలించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో చోటే నేతాజీ తదుపరిసారి కాల్ చేసినప్పుడు.. చాలా మంది మర్యాదపూర్వకంగా నో థ్యాంక్స్ చెబుతారేమో?

ఊహించిన స్థాయిలో లేకుండా పోయింది..
కేరళ సీపీఎం‌లో ఇటీవల జయరాజన్ వర్సెస్ జయరాజన్ పోరు మరోసారి తీవ్రమైన సంగతి తెలిసిందే. సీపీఎం కన్నూర్‌ ఫైర్‌బ్రాండ్‌ నేత పీ జయరాజన్‌ తన పార్టీ సహచరుడు ఈపీ జయరాజన్‌పై తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇరువురు నేతల మధ్య హోరాహోరీ పోరు హైడ్రామాను తలపిస్తుందని చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు ఈ విషయం కొంత సద్దుమణిగినట్టుగా తెలుస్తోంది. వివాదాస్పద ఆయుర్వేద రిసార్ట్ ప్రాజెక్ట్‌లో తనకు వాటా లేదని ఈపీ జయరాజన్ చెప్పడాన్ని పార్టీ సహచరులు అంగీకరించడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది.  

అయితే ఆ ప్రాజెక్టులో తన భార్య, కొడుకు వాటాదారులని ఈపీ జయరాజన్ అంగీకరించారు. అయితే పార్టీ ఆయన మాటలను శ్రద్ధగా వినింది. చివరకు పర్యావరణ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు ఆరోపించిన ప్రాజెక్ట్‌లో ఆయన జీవిత భాగస్వామి, కుమారుడు చేసిన కోట్లాది రూపాయల విలువైన పెట్టుబడితో ఈపీ జయరాజన్‌కు వాస్తవానికి ఎటువంటి సంబంధం లేదని ప్రాథమిక నిర్దారణకు వచ్చింది. మరోవైపు ఆరోపణలు చేసిన పి జయరాజన్ ‌కూడా ఈపీ జయరాజన్‌ను స్పష్టంగా టార్గెట్ చేయలేదు. అయితే ఈ అంశంపై మళ్లీ చర్చ  జరగనున్న పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంపైనే అందరి దృష్టి ఉంది. అయితే కామ్రేడ్స్ కోటలో ఏం జరుగుతుందనే కచ్చితమైన వివరాలు బయటకు తెలియకపోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios