Asianet News TeluguAsianet News Telugu

రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్.. లోక్ సభలో మోదీ ప్రకటన

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. 

From the Floor of Parliament, Modi Announces Setting Up of Trust to Construct Ram Temple in Ayodhya
Author
Hyderabad, First Published Feb 5, 2020, 11:47 AM IST

అయోధ్యలో రామ మందిరం పై ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ వేదికగా బుధవారం ఓ ప్రకటన చేశారు. రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ‘ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర’ పేరిట ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశామని.. దానికి కేంద్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు.

కేబినెట్ సమావేశంలో అయోధ్య అంశంలో తాము ఓ కీలక నిర్ణయం తీసుకునట్లు మోదీ చెప్పారు.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మందిర నిర్మాణం, అభివృద్ధి సంబంధిత అంశాలపై ఈ ట్రస్టు స్వతంత్రంగా వ్యహరిస్తుందని మోదీ వివరించారు.

Also Read రామ మందిరం వల్ల శాంతి నెలకొంటుంది: శ్రీశ్రీ రవిశంకర్...

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. అందుకోసం తాను 130కోట్ల మంది ప్రజానీకానికి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు.

అనంతరం  పౌరసత్వ సవరణ  చట్టం గురించి కూడా  ప్రధాని పరోక్షంగా స్పందించారు. ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, బౌద్ధులు... ఇలా దేశంలోని అందరూ ఒకే కుటుంబానికి చెందినవారని చెప్పారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ధి జరగాల్సిందేనని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడి ఆనందం కోసం సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ విధానంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios