అయోధ్య వివాద కేసులో సుప్రీం కోర్టు నియమించిన మధ్యవర్తిత్వ ప్యానెల్‌లో భాగమైన ఆధ్యాత్మిక గురువు  శ్రీ శ్రీ రవిశంకర్ శుక్రవారం ప్రతిపాదిత రామ మందిరం దేశంలో శాంతిని కలిగిస్తుందని, అన్ని వర్గాల మధ్య సోదరభావాన్ని నెలకొల్పుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

నవంబర్ 9 న బాబ్రీ మసీదు-రామజన్మభూమి స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, అయోధ్యలో వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని ముగ్గురు పిటిషన్ దారుల్లో ఒకరైన రామ్ లల్లాకు అప్పగించాలని తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే. 

Also read: 'అయోధ్య రామమందిరం' కథతో బాహుబలి రచయిత.. క్రేజీ హీరోయిన్ మాస్టర్ ప్లాన్!

నాగపూర్ విమానాశ్రయానికి చేరుకున్న విలేకరులతో రవిశంకర్ మాట్లాడుతూ, అయోధ్యలోని రాముడి గొప్ప ఆలయం గురించి దేశం చాలాకాలంగా కలలు కనిందని అన్నారు. 

ప్రతిపాదిత రామ ఆలయం ఎలా ఉండాలని ఆయన భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు రవిశంకర్ బదులిస్తూ, ఇది దేశంలో శాంతిని కలిగిస్తుందిని, రెండు వర్గాల మధ్య సోదరభావాన్ని నెలకొల్పుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. దేశం చాలాకాలంగా కలలుగంటున్న కల సాకారం కావడానికి పనులు ప్రారంభమయ్యాయని, భారీ రామమందిర నిర్మాణం జరగబోతుంది అని అన్నారు. 

అయోధ్య వివాద మధ్యవర్తిత్వ కమిటీలో భాగమైనందున సుప్రీమ్ కోర్ట్  తీర్పుపై ఆయన అభిప్రాయాల గురించి అడగగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు బదులిస్తూ...  ఆ పని పూర్తయిందని, తాము ఇంతకుముందు చెప్పిందే జరిగిందని, అత్యున్నత న్యాయస్థానం తీర్పుకూడా అదే అని అన్నారు. 

రామ మందిర నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయని ప్రశ్నకు సమాధానమిస్తూ, రామ మందిర పనులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు.

Also read: Ayodhya Verdict: సుప్రీమ్ ప్రయోగించిన అస్త్రం.... ఆర్టికల్ 142

రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేస్తున్న కమిటీలో తాను భాగస్వామిని కాబోనని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ స్పష్టం చేసారు.

అయోధ్యలో ఒక మసీదును నిర్మించడానికి ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నా విషయం తెలిసిందే. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మానసపుత్రికైన సాంస్కృతిక కార్యక్రమం 'ఖాస్దార్ సంస్కృత మహోత్సవ్' ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రవిశంకర్ నాగపూర్ విచ్చేసారు.