ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్ స్నేహం చేసి, ఆమెను భోపాల్‌కు రమ్మని రాజస్థాన్ కు చెందిన యువకుడు ప్రలోభపెట్టాడు. అనంతరం గుడిలో పెళ్లి చేసుకున్నట్టు నటించి.. ఓ హోటల్ తీసుకెళ్లి.. మూడు రోజుల పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ యువకుడిని వాడాలా టిటి పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. బయట ప్రపంచంలో సంబంధం లేకుండా బతుకుతున్నారు. మరి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా ప్రభావానికి లోనై.. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తితో స్నేహం చేసి.. వాడిని గుడ్డిగా ప్రేమించింది. పెళ్లి చేసుకుంటా అని మయ మాటలు చెప్పడంతో .. కన్న తల్లిదండ్రులకు చెప్పకుండా.. అతడు రమ్మన్న చోటకి వెళ్లిపోయింది. ఓ గుడిలో వాడిని పెళ్లి చేసుకుంది. కట్ చేస్తే.. అక్కడ రెండు నెలలు నరకం అనుభవించి చివరకు ఎలాగోలా ఆ మయగాడి చెరలో నుంచి బయటపడింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం, దొంగతనం, కిడ్నాప్ , పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముంబయి ఓ కాలనీలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలికకు సుమారు 6 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాజస్థాన్‌కు చెందిన నజీమ్ ఖాన్ 24 ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. ఆ మైనర్ బాలికతో తరుచు చాట్ చేస్తూ.. స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరూ నిరంతరం ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఇలా అమ్మాయిని నమ్మించి ప్రేమలోకి దించాడు. నజీమ్ ఖాన్ మాటలు నమ్మిన బాలిక .. అతడు ఏం చెప్పిన చేసేది. ఈ క్రమంలో భోపాల్‌కు రమ్మని ప్రలోభపెట్టాడు.
దీంతో ఆ బాలిక మార్చి చివరి వారంలో తల్లిదండ్రులకు చెప్పకుండా.. ఇంటి నుంచి పారిపోయింది. నజీమ్ ఖాన్ ఆమెను ఓ గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్టు నటించాడు. ఆ తర్వాత ఆ బాలికను ఓ హోటల్ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా మూడు రోజుల పాటు నానా చిత్రహింసలకు గురి చేశాడు. అనంతరం ఆమెను హోటల్ గదిలో బంధించి మొబైల్ తీసుకుని పరారయ్యాడు. ఈ క్రమంలో బాలిక తండ్రికి ఫోన్ చేసి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక.. ఓ మహిళ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించింది.
ఈ ఘటనపై సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ గంగాడ్ మాట్లాడుతూ.. మార్చి 28న నిందితుడు నజీమ్ ఖాన్ బాధితురాలిని గుడికి తీసుకెళ్లి మైనర్ అయినప్పటికీ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. బాలిక ఎలాగోలా భోపాల్‌లోని హోటల్ నుండి బయటపడింది. చివరికి రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ క్రమంలో ఓ మహిళ ఆమెకు ఆశ్రయమిచ్చింది. ఈ క్రమంలో ముంబై పోలీసులు ఆమె లొకేషన్‌ను కనుగొని, పోలీసు బృందం అహ్మదాబాద్‌కు వెళ్లి ఆమెను రక్షించారు. అమ్మాయి సహాయంతో.. తాము ఖాన్ మొబైల్ నంబర్‌ను పొందామని తెలిపారు. సాంకేతిక సహాయంతో ఖాన్ ముంబైకి వచ్చే వరకు నిరంతరం నగరాలు తిరుగుతున్నట్లు తెలిసింది. వర్లీలోని నెహ్రూ ప్లానిటోరియం దగ్గర నుండి అతనిని అరెస్టు చేసామని చెప్పారు.
