రిషికేశ్: భారతదేశంలోని పవిత్రమైన రిషికేశ్ లో ఓ యువతి నగ్నంగా వీడియో షూటే చేసింది. దేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో రిషికేశ్ కూడా ఒకటి. రిషికేశ్ లోని లక్ష్మణ్ ఝూల వద్ద ఫ్రాన్స్ కు చెందిన యువతి నగ్నంగా వీడియో షూట్ చేయడం వివాదంగా మారింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

దాన్ని చూసిన గజేంద్ర సాజ్వాన్ అనే వ్యక్తి తీవ్రంగా మండిపడ్డాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఆ యువతిని అరెస్టు చేశారు. ఎందుకు అలా చేశావని యువతిని పోలీసులు ప్రశ్నించారు. నగ్నంగా వీడియో తీయడం భారతదేశంలో నేరమని తనకు తెలియదని ఆ యువతి చెప్పింది. ఆ తర్వాత బెయిలుపై ఆమెను విడుదల చేశారు. 

ఆ 27 ఏళ్ల ఫ్రెంచ్ యువతిపై భారతదేశంలోని ఇంటర్నెట్ చట్టం కింద కేసు పెట్టారు. ఈ కేసులో నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. రిషికేశ్ లోని లక్ష్మణ్ ఝూలాలో రాముడు, లక్ష్మణుడు, సీత గంగానదిని దాటారని హిందువులు భావిస్తారు. అందుకే దాన్ని పవిత్రంగా చూస్తారు. 

అక్కడ నగ్నంగా వీడియో షూట్ చేసిన ఫ్రెంచ్ మహిళ లాక్ డౌన్ విధించడానికి కొద్ది రోజుల ముందు మార్చి నుంచి భారతదేశంలో ఉంటోంది. తాను బీడ్ నెక్లెస్ లను ఆన్ లైన్ లో విక్రయిస్తుంటానని, దాని ప్రమోషన్ కోసం ఫోటో షూట్ చేశానని చెప్పింది. 

ఫ్రెంచ్ మహిళ హోటల్ గదిలో కూడా నగ్నంగా ఫొటోలు తీసిందని పోలీసులు చెబుతున్నారు. మహిళ ఫోన్ ను స్వాధీనం చేసుకుని బెయిలుపై యువతిని విడుదల చేశారు.