France Air Force In India: పసిఫిక్ మహాసముద్రంలో ప్రాన్స్ చేపట్టిన మెగా మిలటరీ ఆపరేషన్‌లో భాగంగా తమిళనాడులోని IAF యొక్క సూలూర్ స్థావరం లో ఫ్రెంచ్ వైమానిక దళం, అంతరిక్ష దళం ల్యాండ్ అయ్యాయి. ఫ్రెంచ్ దళానికి భారత వైమానిక దళం అందించిన మద్దతు సైనిక సహకారాన్ని పెంచడానికి 2018లో ఫ్రాన్స్ మరియు భారతదేశం సంతకం చేసిన పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందానికి నిదర్శనం
France Air Force In India: ఫ్రెంచ్ యుద్ధ విమానాలు అనూహ్యంగా భారత్‌లో ల్యాండ్ అయ్యాయి. సైనిక చర్యలో భాగంగా ఫ్రెంచ్ వైమానిక దళం, అంతరిక్ష దళం తమిళనాడులోని భారత వైమానిక దళం (IAF) యొక్క సూలూర్ సెంటర్‌లో ల్యాండ్ అయ్యాయి. ఇందులో ఫ్రెంచ్ ఎయిర్, స్పేస్ ఫోర్స్ బృందంతో పాటు మూడు రాఫెల్ జెట్‌లు ఉన్నాయి. ఫ్రాన్స్ ‘పెగేస్ 22’ కోడ్ పేరుతో ఇండో-పసిఫిక్‌లో సుదీర్ఘ మిషన్‌ను చేపట్టింది. ఈ మిషన్ మొదటి దశలో మెట్రోపాలిటన్ ఫ్రాన్స్ నుంచి ఫ్రెంచ్ భూభాగమైన న్యూ కాలెడోనియా వరకు ఆ దేశ వైమానిక దళాన్ని 72 గంటల కంటే తక్కువ సమయంలో మోహరించనున్నారు. తద్వారా సుదూర ఎయిర్ పవర్‌లో ఫ్రాన్స్ సామర్థ్యాన్ని చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందులో భాగంగా ఆగస్టు 10, 11 తేదీల్లో ఫ్రెంచ్ వైమానిక దళ ఫైటర్ జెట్లు ఏకంగా 16,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అయితే.. అనూహ్యంగా బుధవారం సాయంత్రం తమిళనాడులోని IAF సూలూర్ ఎయిర్‌బేస్‌లో దిగాయి. ఇందులో మూడు రాఫెల్ జెట్‌లు, సహాయక విమానాలు ఉన్నాయి. యుద్ద విమానాల్లో ఇంధనం నింపుకున్న తర్వాత గురువారం ఉదయం న్యూ కలెడోనియాకు ఫ్రెంచ్, అంతరిక్ష యుద్ధ విమానాలు బయలుదేరాయి. మిషన్ ‘Pagase 22 ఆగస్ట్ 10న ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 18 వరకు సాగుతుంది.
ఈ మిషన్ మొదటి దశ 72 గంటల కంటే తక్కువ సమయంలో పసిఫిక్ మహాసముద్రంలోని ఫ్రెంచ్ ప్రాంతంలో న్యూ కలెడోనియాలో మెట్రోపాలిటన్ ఫ్రాన్స్ నుండి వైమానిక దళ సిబ్బందిని మోహరించడం ద్వారా సుదూర వైమానిక శక్తిని ప్రయోగించడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రకటన తెలిపింది.
2018లో ఫ్రాన్స్, భారత్ మధ్య సైనిక సహకార ఒప్పందం జరిగింది. ఆ ఒప్పంద భాగంగానే ఫ్రాన్స్ యుద్ద విమానాలు భారత్ తో దిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఫ్రెంచ్ సైన్యానికి భారత వైమానిక దళం మద్దతు నిలిచింది. ఇరుదేశాల మధ్య పటిష్ఠ రక్షణ సంబంధాలకు నిదర్శమని ఇరు దేశాలు పేర్కొన్నాయి. ఫ్రెంచ్, భారత వైమానిక దళాల మధ్య పరస్పర విశ్వాసం, పరస్పర చర్యలు ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. ఈ ఆపరేషన్ లో ఫ్రెంచ్ కు భారత వైమానిక దళం ఉన్నత స్థాయి పరస్పర సహకారం అందిస్తోంది.
మరోవైపు.. మిషన్ పెగేస్ 22 తదుపరి దశలలో, ఫ్రెంచ్ వైమానిక దళం బృందం ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 10 వరకు ఆస్ట్రేలియాలో "పిచ్ బ్లాక్" వైమానిక వ్యాయామంలో పాల్గొంటుంది. ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఎ, జర్మనీ, ఇండోనేషియా, సింగపూర్, యుకె, దక్షిణ కొరియాలతో పాటు భారత వైమానిక దళం కూడా ఈ బహుపాక్షిక వ్యాయామంలో పాల్గొంటుంది. ఫ్రాన్స్ తన వైమానిక సామర్థ్యాన్ని, శక్తిని ప్రదర్శించడానికి ఈ మిషన్ ను చేపట్టింది.