Asianet News TeluguAsianet News Telugu

చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట.. నలుగురు మహిళలు దుర్మరణం

తమిళనాడులో తైపుసం పండుగ సందర్భంగా ఓ వ్యాపారి ఉచితంగా చీరలను పంచి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకోసం టోకెన్లు అందించే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇక్కడే తొక్కిసలాట జరిగింది. దీంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
 

four women died in stampede which occured while distributing sarees in tamilnadu
Author
First Published Feb 4, 2023, 7:19 PM IST

చెన్నై: తమిళనాడులో తైపుసం పండుగను పురస్కరించుకుని ఓ వ్యక్తి చీరలను పంచాలని నిర్ణయం తీసుకున్నాడు. కొద్ది సంఖ్యలో ఉచితంగా చీరలను పంచాలని అనుకున్నాడు. అనుకున్నట్టే చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాడు. అయితే, ఈ కార్యక్రమానికి తాను అనుకున్న దాని కన్నా ఎక్కువ మంది మహిళలు వచ్చారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: రూ. 2 వేలకు కక్కుర్తి పడి.. ఆ పని చేస్తూ పట్టుబడ్డ ప్రముఖ హాలీవుడ్ నటి, పోలీసు కేసు నమోదు

ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో వనియంబడిలో చోటుచేసుకుంది. తైపుసం పండుగ సందర్భంగా ఓ బిజినెస్ మ్యాన్ వెష్టీస్, చీరలను ఉచితంగా పంపిణీ చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం ముందుగా టోకెన్లు ఇచ్చాడు. ఆ తర్వాత టోకెన్లను చూపించి చీరలను పొందాలని సూచించాడు. టోకెన్ల కోసం మహిళలు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు మహిళలు మరణించినట్టు తిరుపత్తూరు పోలీసు అధికారులు తెలిపారు.

ఒడిశాలోని ప్రసిద్ధ మకరమేళాకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా బరాంబ-గోపీనాథ్‌పూర్‌ టీ-బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దాదాపు డజను మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ బంధువులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గత నెలలో ఈ ఘటన జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios