రూ. 2 వేలకు కక్కుర్తి పడి.. ఆ పని చేస్తూ పట్టుబడ్డ ప్రముఖ హాలీవుడ్ నటి, పోలీసు కేసు నమోదు
ప్రముఖ హాలీవుడ్ నటి క్లో చెరీ రూ. 2వేలు ఖరీదైన బ్లౌజ్ దొంగతనం చేసి పట్టుబడింది. షాపు యాజమాన్యం సీసీటీవీలో ఇది గమనించి నిలదీశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు ఆమె పై కేసు నమోదు చేశారు.

న్యూఢిల్లీ: సెలెబ్రిటీలు అంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది. కనీస అవసరాలకు సరిపడా సొమ్ము లేకుండా ఉండరు. అయితే, కొన్నిసార్లు సెలెబ్రిటీ హోదాలో ఉన్నప్పటికీ చాలా సిల్లీ రీజన్స్‌కు కొందరు వార్తల్లోకి ఎక్కుతారు. తాజాగా, ఇలాగే ఓ హాలీవుడ్ సెలెబ్రిటీ చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. హాలీవుడ్‌లో ఫేమస్ యాక్ట్రెస్ ఆమె.. కానీ, రూ. 2 వేలకు కక్కుర్తి పడి ఓ బ్లౌజ్ దొంగిలించి పట్టుబడింది.
ప్రముఖ అమెరికన్ నటి క్లో చెరీ చాలా పాపులర్. అడల్ట్ కంటెంట్, యుఫోరియా వంటి సిరీస్‌లతో ఆమె చాలా ఫేమస్ అయ్యారు. మంచి గుర్తింపు పొందారు. ఆమె ఇటీవలే పెన్సిల్వేనియాలోని లాన్‌కాస్టర్‌లో ఓ రిటైల్ స్టోర్‌కు షాపింగ్ చేయడానికి వెళ్లారు. అక్కడ షాపింగ్ చేస్తూ రూ. 2 వేల విలువైన బ్లౌజ్‌ను గుట్టుగా దొంగిలించారు. తాను చేసిన పనిని ఎవరూ గమనించలేదని అనుకున్నారు. కానీ, అక్కడే ఉన్న సీసీటీవీలో ఆమె చోరీ ఆసాంతం రికార్డ్ అయింది. ఇది చూసి షాపు యాజమాన్యం ఆమెను నిలదీసింది. దీంతో క్లో చెరీ సమాధానం చెప్పడానికి తడబడింది. ఖంగుతిని బిత్తరపోయింది. ఆ తర్వాత షాపు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: ప్రముఖ హాలీవుడ్ నటి కిర్‌స్టీ అల్లే కన్నుమూత..
పోలీసులు స్పాట్‌కు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారించారు. సెలెబ్రిటీలు చోరీలకు పాల్పడటం ఇదే తొలిసారేమీ కాదు. గతంలో వినోనా రైడర్ అనే ఓ హాలీవుడ్ నటి 5 వేల డాలర్ల విలువైన డిజైనర్ ఐటమ్ దొంగతనానికి పాల్పడి పట్టుబడింది. ఆమె పై కేసు నమోదవ్వడమే కాదు.. మూడేళ్లపాటు నిషేధానికి కూడా గురైంది.