దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఈసి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుండి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ప్రధాన ఎన్నికల కమీషనర్ ఓపి రావత్ వెల్లడించారు.
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఈసి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుండి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ప్రధాన ఎన్నికల కమీషనర్ ఓపి రావత్ వెల్లడించారు.
మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయో కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రావత్ మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల్లో కూడా డిసెంబరు 15 లోపు ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రటకించింది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 12న మొదటి దశ, 20న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 28న ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది.
మిజోరంలో కూడా నవంబర్ 28 వ తేదీనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఇక్కడ కూడా ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.ఇక తెలంగాణ తో పాటు రాజస్థాన్ లోను డిసెంబర్ 7 వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.
ఈ ఐదు రాష్ట్రాల్లో పోలైన ఓట్లను డిసెంబర్ 11 న కౌటింగ్ చేపట్టనున్నట్లు ఎన్నికల కమీషన్ వెల్లడించింది. మొత్తంగా డిసెంబర్ 15 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు కర్ణాటక లోని మూడు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. షిమోగా, బళ్ళారి, మండ్యా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రావత్ వెల్లడించారు.
సంక్షిప్త వివరాలు
ఛత్తీస్ ఘర్ మొదటి దశ ఎన్నికల షెడ్యూల్:
18 అసెంబ్లీ నియోజకవర్గాలు
నోటిఫికేషన్ : అక్టోబర్ 16
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: 23 అక్టోబర్
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24
ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 26
పోలింగ్: నవంబర్ 12
ఛత్తీస్ ఘర్ రెండో దశ ఎన్నికల షెడ్యూల్:
72 అసెంబ్లీ నియోజకవర్గాలు
నోటిఫికేషన్ : అక్టోబర్ 26
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 2
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 3
ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 5
పోలింగ్: నవంబర్ 20
మధ్య ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ : నవంబర్ 2
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 9
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 12
ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 14
పోలింగ్: నవంబర్ 28
రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ : నవంబర్ 12
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 19
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 20
ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 22
పోలింగ్: డిసెంబర్ 7
అన్ని రాష్ట్రాల్లో కౌటింగ్: డిసెంబర్ 11
