దారుణం: కారులో భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్‌రేప్

Four rape pregnant woman in Maharashtra; 3 held
Highlights

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకొంది.  మానవత్వాన్ని మరిచిపోయిన దుండగులు  కారులో  భార్యపై భర్త ఎదుటే  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు  8 మాసాల గర్భిణీ. అయినా కూడ  నిందితులు కనికరం చూపలేదు.

ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకొంది.  మానవత్వాన్ని మరిచిపోయిన దుండగులు  కారులో  భార్యపై భర్త ఎదుటే  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు  8 మాసాల గర్భిణీ. అయినా కూడ  నిందితులు కనికరం చూపలేదు.

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బాధితురాలు ఆమె భర్త ఓ హోటల్‌ను నడుపుతున్నారు. అయితే ఈ హోటల్‌లో పనిచేసేందుకు గాను జంటకు  పనిమనుషుల్ని చూపిస్తామని నమ్మబలికిన ఓ నిందితుడు  బాధితురాలిపై  అత్యాచారానికి పాల్పడ్డారు.

హోటల్‌లో పనిచేసేందుకు  మరో ఇద్దరు పనిమనుషులు వీరికి అవసరమయ్యారు. పని మనుషులను చూపిస్తామని బాధితురాలిని, ఆమె భర్తను ముకుంద్ మాన్ సంప్రదించాడు. తుర్చిఫాటా ప్రాంతంలో ఓ జంట హోటల్ లో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారని ముకుంద్ మాన్ నమ్మబలికాడు.  అయితే  వారికి రూ. 20 వేలు అడ్వాన్స్ ఇవ్వాలని సూచించాడు.

దీంతో భార్యతో కలిసి హోటల్ యజమాని  తుర్చిఫాటాకు వెళ్లాడు.  అక్కడే మరో 8 మంది నిందితులతో కలిసి  ముకుంద్ అతనిపై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం అతడిని కారులో కట్టేసి బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.  బాధితురాలి వద్ద ఉన్న బంగారాన్ని దోచుకొన్నారు.  ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.  ఈ ఘటనపై  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

loader