Ajmer: అజ్మీర్ జాతీయ రహదారిపై ట్రక్కు, గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో పెద్దఎత్తున మంట‌లు చెల‌రేగాయి. న‌లుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు.  

Road Accident In Ajmer: అజ్మీర్ జాతీయ రహదారిపై ట్రక్కు, గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో పెద్దఎత్తున మంట‌లు చెల‌రేగాయి. న‌లుగురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి పోలీసులు మాట్లాడుతూ.. అజ్మీర్‌లో రోడ్డు ప్రమాదం అజ్మీర్ జిల్లాలో గత రాత్రి (గురువారం) జాతీయ రహదారిపై గ్యాస్ ట్యాంకర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై అజ్మీర్‌లోని బీవార్‌ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని జాతీయ రహదారి 8 వద్ద తెల్లవారుజామున రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మొత్తం నలుగురు వ్యక్తులు మరణించారు. వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదిక‌ల ప్ర‌కారం.. రెండు వాహనాలు ఢీకొనడంతో పెద్దఎత్తున‌ మంటలు చెలరేగినట్లు సమాచారం అందిందని ఆదర్శ్ నగర్ ఎస్ఐ కన్హయ్యలాల్ తెలిపారు. అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను ఆర్పివేశామ‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయార‌ని వెల్ల‌డించారు. 

గ్రౌండ్ రిపోర్టు ప్రకారం ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే మంటలు 30 అడుగుల ఎత్తువ‌ర‌కు వ్యాపించాయి. రెండు ట్రయిలర్ ట్రక్కులు ఢీకొనడంతో ఒకటి డివైడర్ దాటగా, అవతలి వైపు నుంచి వస్తున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో రెండు ట్రక్కుల్లో మొత్తం ఐదుగురు ఉన్నారు. న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నార‌ని తెలిపారు.

Scroll to load tweet…