Asianet News TeluguAsianet News Telugu

నలుగురు ఎమ్మెల్యేల మిస్సింగ్, అధికార పార్టీలో టెన్షన్

నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మిస్సింగ్ కర్ణాట రాజకీయాల్లో కలవరం పెడుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవులు ఆశించిన ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్లుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అధికార పార్టీ వెన్నులో వణుకుపుడుతోంది. 

four mlas are missing in karnataka state, tension in karnataka government
Author
Bengaluru, First Published Dec 31, 2018, 1:22 PM IST

బెంగళూరు : నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మిస్సింగ్ కర్ణాట రాజకీయాల్లో కలవరం పెడుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవులు ఆశించిన ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్లుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అధికార పార్టీ వెన్నులో వణుకుపుడుతోంది. 

అటు ప్రతిపక్ష పార్టీ బీజేపీ సైతం ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి జై కొడితే పరిస్థితి ఏంటన్నభయంతో కుమార స్వామి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, హొసపెటె ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌, కంప్లి ఎమ్మెల్యే గణేష్ లతో పాటు కాంగ్రెస్‌ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే జార్కహోలే మంత్రి వర్గం విస్తరణ జరిగిన మరుసటి రోజు నుండీ కనిపించడం లేదు. అయితే ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారా అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. 

బీజేపీ రాజకీయ వ్యూహంలో జేడీఎస్ తో జత కట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో కర్ణాటక సీఎం కుమారస్వామి టెన్షన్ పడుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేల అజ్ఞాత వాసం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి. 

నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్ కు చిక్కుకుపోయారా అన్న సందేహం నెలకొంది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే సంకేతాలు ఉన్న నేపథ్యంలో  బీజేపీ అధికారం కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

అలాగే మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో ఎంపీ స్థానాలను గెలవాలంటే అధికారంలో ఉంటే మంచిదన్న లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేలు మిస్ అవ్వడం అధికార పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios