Jammu Kashmir: దేశంలోని ప్ర‌ముఖుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే జ‌మ్మూకాశ్మీర్‌కు చెందిన న‌లుగురు మాజీ ముఖ్య‌మంత్రులకు క‌ల్పిస్తున్న స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) భద్రతను ఉపసంహరించుకుంది. దీనిపై జ‌మ్మూకాశ్మీర్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్త చేస్తున్నారు.  

Jammu Kashmir: దేశంలోని ప్ర‌ముఖుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే జ‌మ్మూకాశ్మీర్‌కు చెందిన న‌లుగురు మాజీ ముఖ్య‌మంత్రులకు క‌ల్పిస్తున్న స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) భద్రతను ఉపసంహరించుకుంది. Special Security Group (ఎస్ఎస్‌జీ) భ‌ద్ర‌త‌ను ఉపసంహ‌రించుకున్న ప్ర‌ముఖ నేత‌ల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రులు ఫరూక్‌ అబ్దుల్లాతో పాటు ఆయన తనయుడు ఒమర్‌ అబ్దు్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ అజాద్ లు ఉన్నారు. భద్రతా సమీక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎస్‌ఎస్‌జీ అనేది జమ్మూకశ్మీర్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక భద్రతా విభాగం. గతంలో రాష్ట్రంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు రక్షణ కల్పించడానికి Special Security Group (ఎస్ఎస్‌జీ)ను ఏర్పాటు చేశారు. 

జ‌మ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు రక్షణ కల్పించడానికి Special Security Group (ఎస్ఎస్‌జీ)ను ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు వారికి క‌ల్పిస్తున్న ఎస్ఎస్‌జీ భ‌ద్ర‌త‌ను ఉప‌సంహరించుకోవ‌డంపై ఆయా నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తనకు ఎస్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించడంపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఇది స్పష్టంగా రాజకీయ నిర్ణయమేనన్నారు. Special Security Group (ఎస్ఎస్‌జీ) ను ఉపసంహరణకు సంబంధించి తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. ఇలాంటి చర్యలతో తమ గ‌ళాన్ని అడ్డుకోలేరని తెలిపారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సైతం ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. భద్రతను ఉపసంహరించుకున్న విషయంపై తనకు కూడా సమాచారం ఇవ్వలేదని ముఫ్తీ అన్నారు. భ‌ద్ర‌త‌కు ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి అధికారికంగా తనకు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ ప్ర‌శ్నించారు. జ‌మ్మూకాశ్మీర్ ప్ర‌జ‌లను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆమె అన్నారు. 

నలుగురు మాజీ సీఎంల (ఫ‌రూక్‌ అబ్దుల్లా, ఒమ‌ర్ అబ్దుల్లా, మెహ‌బూబా ముఫ్తీ, గులాంన‌బీ ఆజాద్‌) భద్రతను వర్గీకరించి వారికి ఉన్న ముప్పును అంచనా వేసి జమ్మూకశ్మీర్‌ పోలీసుల భద్రతా విభాగం ద్వారా రక్షణ కల్పించనున్నార‌ని స‌మాచారం. ఇక జ‌మ్మూకాశ్మీర్‌లో గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా కొన‌సాగుతున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు, హింస నేప‌థ్యంలో.. జ‌మ్మూకాశ్మీర్‌కు క‌ల్పిస్తున్న ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని ర‌ద్దు చేసింది. దీని కోసం 2019లో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేయటంతోపాటు రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. శాంతిభద్రతలు కుదుటపడేంత వరకు జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంద‌ని తెలిపింది. శాంతిభద్రతలు నెలకొనగానే జమ్మూకాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరిపిస్తారు. లడక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఆ త‌ర్వాత జ‌మ్మూకాశ్మీర్ లో చాలా కాలం పాటు అనేక ఆంక్ష‌లు కొన‌సాగాయి. టెలికాం స‌ర్వీసుల‌ను సైతం నిషేధించింది. ఆ స‌మ‌యంలో రాష్ట్ర కీల‌క నేత‌ల‌ను గృహ‌నిర్భంద‌లో ఉంచారు.