తమిళనాడు చెంగల్ పట్టు వద్ద  అదుపుతప్పి కాలువలో  కారు బోల్తా పడింది. ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్ పట్టు జిల్లాలో బుధవారంనాడు జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.అతి వేగంగా ప్రయాణీస్తున్న కారు అదుపు తప్పి కాలువలో పడింది. రాష్ట్రంలోని మధురందగంలోని అయ్యనార్ కోవిల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నై నుండి కారు తిరుచ్చి వెళ్తున్న సమయంలో అయ్యనార్ కోవిల్ వద్ద అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో కారులోని ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.