తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో మంగళవారం నాడు లోకల్‌ ట్రైన్‌లో విషాదం చోటు చేసుకొంది.పుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తున్న నలుగురికి విద్యుత్‌షాక్ తగిలి మృతి చెందారు


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో మంగళవారం నాడు లోకల్‌ ట్రైన్‌లో విషాదం చోటు చేసుకొంది.పుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తున్న నలుగురికి విద్యుత్‌షాక్ తగిలి మృతి చెందారు. సోమవారం రాత్రి కూడ ఇదే ప్రాంతంలో మరో ఇద్దరు కూడ మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. లోకల్ ట్రైన్‌లో పుట్‌బోర్డుపై ప్రయాణం చేస్తుండగా రైల్వే ట్రాక్‌కు పక్కనే ఉన్న విద్యుత్ స్థంభం తగలడంతో షాక్ కు గురయ్యారు.

దీంతో పుట్‌బోర్డుపై ప్రయాణం చేస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ షాక్ కు గురైన వెంటనే పుట్‌బోర్డుపై నిల్చున్న ప్రయాణీకులంతా రైలు నుండి కింద పడ్డారు. దీంతో వారి తలలకు తీవ్ర గాయాలయ్యాయి.

నలుగురు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటన తెలిసిన వెంటనే రైలును నిలిపివేశారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను రైల్వే శాఖాధికారులు విచారిస్తున్నారు.