వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్.. మొదటి స్పందన ఏంటంటే ?
కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతిగా సేవలు అందించిన వెంకయ్య నాయడికి దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ (Venkaiah Naidu conferred with Padma Vibhushan award) వరించింది. ప్రజా వ్యవహారాల విభాగం కింద ఆయనకు పురస్కారం లభించింది. దీనిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (former vice president Venkaiah Naidu) మొదటి సారిగా స్పందించారు.
మాజీ ఉప రాష్ట్రపతికి వెంకయ్య నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రజా వ్యవహారాల విభాగం కింద పురస్కారం పొందిన ఒకే ఒక్క వ్యక్తి వెంకయ్య నాయుడు. అయితే వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినందుకు సినీ నటుడు చిరంజీవి, వైజయంతిమాల బాలి, బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం), పద్మ సుబ్రహ్మణ్యం వంటి నటులకు ఈ అవార్డు వరించింది.
PadmaAwards: ఉమామహేశ్వరికి, గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పలకు పద్మ శ్రీ అవార్డులు.. ఫుల్ లిస్టు ఇదే
పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల వెంకయ్య నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో చేసిన పోస్ట్ లో తన సంతోషాన్ని పంచుకుున్నారు. ఈ గౌరవం పట్ల తాను నిజంగా వినయంగా ఉన్నానని, ఈ అవార్డును రైతులు, మహిళలు, యువకులు, భారతదేశంలోని తన తోటి పౌరులందరికీ అంకితం చేస్తున్నానని తెలిపారు.
ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉణ్నానని, అందుకే ఈ వార్డు వచ్చిందని తెలిపారు. ఈ గౌరవం జాతీయ స్థాయిలో తన పాత్రపై మరింత స్పృహను కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా.. అసాధారణ, విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. 2024 సంవత్సరానికి గాను 132 పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఈ జాబితాలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతల్లో 30 మంది మహిళలు కాగా, విదేశీయులు/ ఎన్ఆర్ఐ/ పీఐఓ/ ఓసీఐ కేటగిరీకి చెందిన 8 మంది, మరణానంతరం 9 మంది అవార్డు గ్రహీతలు ఉన్నారు. అవార్డు గ్రహీతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ‘‘వివిధ రంగాలకు విశేష సేవలందించినందుకు పద్మ అవార్డులకు ఎంపికైన, మన సమాజంలో మార్పు తీసుకొచ్చే వారికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని అభినందించడానికి ఒక వేదికగా మార్చారు’’ అని పేర్కొన్నారు.
150 Years Imprisonment: మైనర్ కుమార్తెపై పలుమార్లు అత్యాచారం.. కీచక తండ్రికి 150 ఏళ్ల జైలు శిక్ష..
సామాజిక మార్పుకు ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తులను అభినందించే వేదికగా పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రధాని మోడీ హేతుబద్ధీకరించారని అమిత్ షా తెలిపారు. పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు ఇతరులకు ప్రేరణ కలిగించడమే కాకుండా, తమ సేవలతో దేశ గౌరవాన్ని పెంచారని తెలిపారు.