కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ చకుర్కర్ దగ్గరి బంధువు, వరసకు సోదరుడు అయిన చంద్రశేఖర్ చకుర్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కొన్నేళ్లుగా ఓ వ్యాధితో బాధపడుతున్నాడని, దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ చకుర్కర్ సోదరుడు మహారాష్ట్రలోని లాతూర్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం తుపాకీతో తనను తాను కాల్చుకొని ఈ చర్యకు పాల్పడ్డాడు. 81 ఏళ్ల మాజీ మంత్రి బంధువు, సోదరుడు అయిన ఆయన హన్మంతరావు పాటిల్ ఆత్మహత్యకు చేసుకునేందుకు ముందు తన కుటుంబ సభ్యులకు వీడ్కోలు సందేశం పంపించాడు.
ఫోన్‌లో కాదు.. ఆయన మెదడులోనే పెగాసెస్ స్పైవేర్ : రాహుల్‌కు శివరాజ్ సింగ్ చౌహన్ కౌంటర్
హన్మంతరావు పాటిల్ ను చంద్రశేఖర్ చకుర్కర్ అని కూడా పిలుస్తారు. ఆయన మాజీ మంత్రి 'దేవ్ఘర్' నివాసానికి సమీపంలోనే నివసిస్తున్నారని, తరచూ నివాసాన్ని సందర్శించేవారని పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఈ ఉదయం 9 గంటల సమయంలో తన లైసెన్స్డ్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.
కొన్నేళ్లుగా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న ఆయన దానితోనే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు మంత్రి కుమారుడు కూడా ఉన్నారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దిబేశ్ ఫీవర్, డిప్యూటీ ఎస్పీ జితేంద్ర జగ్దాలే వంటి సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
