మొన్ననే ఎన్నికల్లో గెలిచి.. నేడు ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలో శాసనసభ కొలువుదీరి కొద్దిరోజులు కాకముందే విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ(67) రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. గోవా నుంచి బాగల్‌కోట్‌ వస్తుండగా తులసిగెరె వద్ద ఎమ్మెల్యే కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. బాగల్‌కోట్‌ జిల్లా జామ్‌ఖండి నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
ఎమ్మెల్యే మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సిద్ధు న్యామగౌడ గతంలో కేంద్ర మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు.