Asianet News TeluguAsianet News Telugu

అద్వానీ పెళ్లికొడుకు, అందుకే ఇలా..: వాజ్‌పేయ్ సరదా వ్యాఖ్యలు

రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే సమయంలో మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ సందర్భం వస్తే చతురోక్తులతో హాస్యాన్ని పండిస్తారు.  సభలోనైనా, పార్టీ కార్యక్రమాల్లోనైనా ఎక్కడైనా సరే వాజ్‌పేయ్ మాత్రం హస్యప్రియుడే. ఇలాంటి ఘటనను  రాజస్తాన్ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్  జనరల్ శ్యాం సుందర్ లడ్రేచా గుర్తు చేసుకొన్నారు.

former prime minister vajpayee funny comments
Author
New Delhi, First Published Aug 17, 2018, 3:47 PM IST


న్యూఢిల్లీ:  రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే సమయంలో మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ సందర్భం వస్తే చతురోక్తులతో హాస్యాన్ని పండిస్తారు.  సభలోనైనా, పార్టీ కార్యక్రమాల్లోనైనా ఎక్కడైనా సరే వాజ్‌పేయ్ మాత్రం హస్యప్రియుడే. ఇలాంటి ఘటనను  రాజస్తాన్ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్  జనరల్ శ్యాం సుందర్ లడ్రేచా గుర్తు చేసుకొన్నారు.

1991లో లడ్రేచా  తన వివాహానికి రావాల్సిందిగా  అప్పటి ఎంపీగా ఉన్న వాజ్‌పేయ్‌కు ఆహ్వానాన్ని పంపారు.  అయితే  ఈ వివాహనికి హాజరుకాబోనంటూ  వాజ్‌పేయ్‌ లడ్రేచాకు ఓ లేఖ పంపారు. ఆ లేఖలో  తాను ఎందకు రావడం లేదో  హస్యాన్ని రంగరిస్తూ  చెప్పారు. ఈ విషయాన్ని లడ్రేచా గుర్తు చేసుకొన్నారు.

1991లో లడ్రేచా పంపిన ఆహ్వానాన్ని  సున్నితంగా వాజ్‌పేయ్ తిరస్కరించారు.  ఢిల్లీలో కూడ ఓ పెళ్లి జరుగుతోంది. పెళ్లి కొడుకు అద్వానీ. ఢిల్లీ ప్రభుత్వాన్ని అద్వానీ పెళ్లి చేసుకోవాల్సి ఉందంటూ  వాజ్‌పేయ్ లడ్రేచాకు లేఖ రాశారు.

అద్వానీ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా రెండు దఫాలు రథయాత్ర జరిగింది. ఈ యాత్ర  కారణంగా  బీజేపీ బలం పుంజుకొంది. 1984లో రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ.. క్రమంగా తన బలాన్ని పుంజుకొంది.  1989 నాటికి బీజేపీ 84 స్థానాలకు చేరింది. ఆ తర్వాత 1991 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీకి 120 సీట్లు దక్కాయి. అద్వానీతో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున ... ఢిల్లీ ప్రభుత్వంతో అద్వానీ పెళ్లి ఉంది... పెళ్లి కొడుకు అద్వానీ అంటూ వాజ్‌పేయ్  ఆ సందర్భంలో  లేఖలో  రాశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios