న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కరోనా సోకింది.  కరోనా చికిత్స కోసం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరాడు.రెండు రోజుల క్రితం కరోనాపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక సూచనలు చేశారు.  కరోనా విషయమై  తీసుకోవాల్సిన చర్యలపై  మన్మోహన్ సింగ్ ప్రధాని మోడీకి లేఖ రాశాడు. 

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ తో పాటు  కరోనా వవైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ప్రభుత్వానికి ఆ లేఖలో పలు సూచనలు చేశారు.  ఈ లేఖకు  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి  హర్షవర్ధన్ కూడ స్పందించారు. మన్మోహన్ సింగ్  రాసిన లేఖకు ఆయన సమాధానం ఇచ్చారు.

ప్రధానికి రాసిన లేఖలో ఐదు అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. రెండు పేజీల లేఖలో ఆయన ఈ ఐదు అంశాలపై సంపూర్ణంగా వివరించారు.దేశంలో  కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా  కరోనా కేసులు దేశంలో  రెండు లక్షలు దాటుతున్నాయి.  కరోనా రోగుల రికవరీ రేటు తగ్గిపోవడం ఆందోళన కల్గిస్తోంది.  దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను  వేగవంతం చేయడంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా చూడాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది.  సెకండ్ వేవ్  లో వైరస్  ఉధృతి ఎక్కువగా ఉందని  నిపుణులు చెబుతున్నారు.