కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో Anil Deshmukh మహారాష్ట్ర మంత్రి వర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. Money laundering అంశంలో అనిల్ దేశ్ ముఖ్ కు ఈడీ సమన్లు జారీచేసింది.

ముంబయి : మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్ట్ అయ్యారు. ముంబై కార్యాలయంలో 12 గంటల పైనే విచారించిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు.

కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో Anil Deshmukh మహారాష్ట్ర మంత్రి వర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 
Money laundering అంశంలో అనిల్ దేశ్ ముఖ్ కు ఈడీ సమన్లు జారీచేసింది.

దీనిపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు తన పిటిషన్ ను తిరస్కరించింది. అయితే ఇటీవల దేశముఖ్ ఆస్తులపై దాడి చేసి ఆస్తులను జప్తు చేసింది.

ముంబైలోని బార్లు రెస్టారెంట్లు నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజేను అనిల్ ఆదేశించినట్లు... ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి. దీంతో అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ allegations నేపథ్యంలో అనిల్ పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సిబిఐని ఆదేశించింది. మనీ లాండరింగ్ పై తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల అనిల్ దేశ్ ముఖ్ ఓ విడుదల చేశారు.

తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఆవాస్తవాలని ఆయన పేర్కొన్నారు. అయితే అనిల్ దేశ్ ముఖ్ లంచం ఆరోపణల కేసులో సీబీఐ ఆదివారం ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. 

మహారాష్ట్ర మాజీ హోంమంత్రికి ఈడీ షాక్: అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో సోదాలు

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఏప్రిల్ 5న రాజీనామా చేశారు. లంచం ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన సోమవారంనాడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు పంపించారు. 

ముంబై పోలీసు మాజీ చీఫ్ Parambir Singh చేసిన ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ జరపాలని బొంబాయి హైకోర్టు సీబిఐ ఆదేశించింది. సీబీఐ ఆదేశాల నేపథ్యంలో అనిల్ దేశ్ ముఖ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. 

తాను ఏ విధమైన తప్పు చేయలేదంటూ రాజీనామా చేయాలనే డిమాండును ఆయన చాలా కాలంగా తిరస్కరిస్తూ వచ్చారు. అనిల్ దేశ్ ముఖ్ మీద వచ్చిన ఆరోపణలపై CBI విచారణ జరుపుతున్న నేపథ్యంలో పదవిలో కొనసాగడం మంచిది కాదనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు ఎన్సీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. 

కోర్టు ఆదేశాలపై మాట్లాడేందుకు పరంబీర్ సింగ్ నిరాకరించారు. తాను మాట్లాడేదేమీ లేదని అన్నారు. తనను బదిలీ చేసిన తర్వాత పరమ్ బీర్ సింగ్ ముఖ్యమంత్రి Uddhav Thackerayకు సంచలన ఆరోపణలతో లేఖ రాశారు. 

బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్ ముఖ్ తనకు చెప్పినట్లు ఆయన ఆరోపించారు. అప్పటి నుంచి కూడా రాజీనామా చేయాలని అనిల్ దేశ్ ముఖ్ మీద ఒత్తిడి వస్తూనే ఉంది.