Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్ర మాజీ హోంమంత్రికి ఈడీ షాక్: అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో సోదాలు


మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో  ఆదివారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  గతంలో ఆయనపై సీబీఐ  అధికారులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ నిర్వహించారు.
 

ED raids Anil Deshmukh's premises near Nagpur after attaching assets worth Rs 4.2 crore under PMLA lns
Author
Mumbai, First Published Jul 18, 2021, 2:14 PM IST

ముంబై: మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి  అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో ఆదివారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు సోదాలు చేశారు.ఈడీ, సీఆర్‌పీఎఫ్ బృందం ఆయన ఇంటిని ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ కానీ ఆయన కుటుంబసభ్యులు కూడ ఎవరూ కూడ ఇంట్లో లేరు. మాజీ మంత్రి దేశ్ ముఖ్ పై మనీలాండరింగ్ వ్యవహరంపై సీబీఐ కేసు నమోదు చేసింది.

సీబీఐ నమోదు చేసిన  ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతంఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.తన పదవిని ఉపయోగించుకొని రూ. 100 కోట్ల వసూళ్లకు అనిల్ దేశ్ ముఖ్ పాల్పడ్డాడని సీబీఐ ఎప్ఐఆర్ లో పేర్కొంది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద  ఆయన ఆస్తులను జప్తు చేసింది. 

వీటిల్లో రూ. 1.5 కోట్ల విలువైన వర్లీలోని ఓ ఫ్లాట్ రూ. 2.67 కోట్ల విలువైన మరికొన్ని స్థలాలున్నాయి.ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుండి నెలకు రూ. వంద కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్ ముఖ్  సస్పెన్షన్ కు  గురైన పోలీస్ అధికారి సచిన్ వాజేను ఆదేశించినట్టుగా మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపించారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios