మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన కురువృద్ధుడు మనోహర్ జోషి కన్నుమూత

హృదయ సంబంధిత అనారోగ్యంతో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన కురువృద్ధుడు మనోహర్ జోషి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 

Former Maharashtra Chief Minister and Shiv Sena stalwart Manohar Joshi passes away - bsb

మహారాష్ట్ర : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఒక రోజు తర్వాత శుక్రవారం తెల్లవారుజామున మరణించినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ముంబైలోని పీడీ హిందూజా ఆస్పత్రిలోని ఐసీయూలో ఆయన్ను చేర్చినట్లు ప్రైవేట్ మెడికల్ ఫెసిలిటీ గురువారం వెల్లడించింది.

లోక్‌సభ మాజీ స్పీకర్ జోషి (86) బుధవారం ఆసుపత్రిలో చేరారని, ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. “మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి 21 ఫిబ్రవరి 2024న PD హిందూజా హాస్పిటల్‌లో చేరారు. ఆయన గుండెపోటుతో బాధపడుతూ, తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ప్రస్తుతం ఐసియులో చికిత్స అందిస్తున్నాం”అని ప్రకటన తెలిపింది.

86 ఏళ్ల శివసేన కురువృద్ధుడు బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతూ గతేడాది మేలో ఇదే ఆస్పత్రిలో చేరారు. మనోహర్ జోషి 1995 నుండి 1999 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అవిభక్త శివసేన నుండి రాష్ట్రంలో అత్యున్నత పదవిని ఆక్రమించిన మొదటి నాయకుడు. అతను పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నికయ్యాడు. వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుండి 2004 వరకు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...బాధిత కుటుంబానికి రూ.1.49 కోట్ల పరిహారం..

దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో జోషి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మహారాష్ట్రలోని కోస్టల్ కొంకణ్ ప్రాంతంలో డిసెంబర్ 2, 1937న జన్మించిన జోషి ముంబైలోని ప్రతిష్టాత్మకమైన వీరమాత జీజాబాయి టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (VJTI) నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు.

జోషీ రాజకీయ జీవితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరడంతో ప్రారంభమైంది. ఆ తరువాత అతను శివసేన సభ్యుడు అయ్యాడు. 1980వ దశకంలో, జోషి శివసేనలో కీలక నాయకుడిగా ఎదిగారు. 

వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్న 2002 నుండి 2004 వరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి అనఘా జోషిని వివాహం చేసుకున్నారు, ఆమె 2020లో 75 సంవత్సరాల వయస్సులో మరణించారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

జోషి ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. నాలుగు దశాబ్దాలకు పైగా శివసేనతో అనుబంధం ఉంది. 1968-70లో ముంబయిలో మునిసిపల్ కౌన్సిలర్‌గా, 1970లో ముంబై మునిసిపల్ కార్పొరేషన్  స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 1976-1977 మధ్యకాలంలో ముంబై మేయర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత 1972లో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. మూడుసార్లు శాసన మండలిలో పనిచేసిన తర్వాత, జోషి 1990లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1990-91లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

1999 సాధారణ ఎన్నికలలో, జోషి ముంబై ఉత్తర-మధ్య లోక్‌సభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా గెలుపొందారు. తరువాత కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగా పనిచేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios