రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...బాధిత కుటుంబానికి రూ.1.49 కోట్ల పరిహారం..

Accident Compensation: రోడ్డు ప్రమాదం విషయంలో ప్రత్యేక ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చూసింది. మహారాష్ట్రలోని థానే జిల్లా నాసిక్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి తరుఫు బంధువులకు  రూ.1.49కోట్ల పరిహారం చెల్లించాల్సి థానే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఆదేశించింది. 

Mumbai Family Awarded Rs 1.49 Crore in Landmark Motor Accident Compensation Case KRJ

Accident Compensation:  రోడ్డు ప్రమాదం విషయంలో ప్రత్యేక ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చూసింది. మహారాష్ట్రలోని థానే జిల్లా నాసిక్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి తరుఫు బంధువులకు  రూ.1.49కోట్ల పరిహారం చెల్లించాల్సి థానే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఆదేశించింది. 

వివరాల్లోకెళ్తే..  2018లో నీలేశ్‌ జోషి (39) అనే వ్యక్తి   ఎస్‌యూవీలో వెళ్తుండగా నాసిక్ సమీపంలో సిన్నార్-షిర్డీ రోడ్డులో పెట్రోల్ పంపు దగ్గర బస్సు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నీలేశ్‌తో పాటు మరో అయిదుగురు  మృతి చెందారు. చనిపోయే నాటికి అతను ఒక ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి నెలకు రూ.లక్ష జీతం వచ్చేది . అలాగే.. ప్రత్యేక కన్సల్టెన్సీ ఉద్యోగం ద్వారా నెలకు రూ.75,000 సంపాదించాడు. ఈ విషయాన్ని అతని బంధువులు MACTకి తెలిపారు. 

ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మసనం..  బాధితుడు జోషి కుటుంబానికి పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుండి 7.50 శాతం వడ్డీతో పాటు రూ. 1.49 కోట్లు చెల్లించాలని వాహన యజమాని చంద్రకాంత్ లక్ష్మీనారాయణ ఇందానీ , యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను కోరారు.  బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలిందని తెలిపింది. జోషి భార్య దీపాలితో సహా హక్కుదారులు ముంబైలోని బోరివలి నివాసితులు. ఈ ధర్మసనం ఆదేశాల మేరకు  బస్సు యజమాని, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్ ఈ మొత్తాన్నిబాధిత కుటుంబానికి చెల్లించాలి. ధర్మాసనం ఫిబ్రవరి 12న ఉత్తర్వులు జారీ చేయగా, గురువారం వివరాలు అందుబాటులోకి వచ్చాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios