తమిళనాడులో మూడు హత్యలు సంచలనం రేపుతున్నాయి. డీఎంకే పార్టీకి చెందిన  మహిళా నేత, ఆమె భర్త, వారి ఇంట్లో పని మనిషి అతి దారుణంగా హత్యకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే... డీఎంకే పార్టీ మహిళా నేత ఉమా మహేశ్వరి(61), ఆమె భర్త మురుగ శంకరన్, వాళ్ల ఇంట్లో పనిమనిషి ఇంట్లో ఉన్న సమయంలో కొందరు దుండగులు మంగళవారం వారి ఇంట్లోకి ప్రవేశించారు.

ఉమా మహేశ్వరి, ఆమె భర్త మరుగ శంకరన్ ని అడ్డు వచ్చిన పని మనిషిని అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.  మధ్యాహ్నం 3గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య ఎవరు చేశారనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.  ఉమా మహేశ్వరి.. 1996 నుంచి 2001 వరకు తిరునెల్వేలి కార్పొరేషన్ కి మేయర్ గా పనిచేశారు.

ఇదిలా ఉంటే ఈ హత్య ఉమామహేశ్వరి కుటుంబసభ్యులే చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్తి తగాదాలు కారణం కావచ్చని పోలీనులు అనుమానిస్తున్నారు. వారి కుమార్తె తన తల్లిదండ్రులను చూడటానికి రావడంతో ఈ హత్యోదంతం బయటకు వెలుగు చూసింది. పలు కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరిం