Asianet News TeluguAsianet News Telugu

విషమంగా కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఆరోగ్యం.. కోలుకోవాలంటూ చౌహాన్ ట్వీట్

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత  కమల్‌నాథ్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ నొప్పి కారణంగా బుధవారం ఆయనను  గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు.

Former CM Kamal Nath admitted to Medanta Hospital after fever ksp
Author
New Delhi, First Published Jun 9, 2021, 5:11 PM IST

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత  కమల్‌నాథ్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ నొప్పి కారణంగా బుధవారం ఆయనను  గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో శ్వాసకోశ విభాగానికి తరలించి సీనియర్‌ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కమల్‌నాథ్‌ ఆరోగ్యం క్షీణిచిందని కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఒక ప్రకటనలో వెల్లడించారు. 

Also Read:ఇండియాలో తగ్గుతున్న కరోనా:రెండో రోజూ లక్షలోపు కోవిడ్ కేసులు

దీంతో కాంగ్రస్‌ నేతలు, కార్యకర్తలు కమల్‌ నాథ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కమల్‌నాథ్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. కాగా కోవిడ్‌-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కమల్‌ నాథ్‌పై గత నెల 24న కేసు నమోదైన సంగతి తెలిసిందే. కరోనా వాస్తవ లెక్కలను వెల్లడించాలన్నందుకు తనపై కేసులు పెడుతున్నారని, దేశద్రేహి అంటున్నారంటూ  కమల్‌నాథ్‌ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. చాలా కాలంగా ఢిల్లీలో వుంటూ రాజకీయాలు చేస్తున్న కమల్ నాథ్‌కు హనీ ట్రాప్‌ కేసులో సిట్‌ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios