Asianet News TeluguAsianet News Telugu

సెయిల్ మాజీ చైర్మన్ పద్మవిభూషన్ వి. కృష్ణమూర్తి మృతి.. రాహుల్ గాంధీ సంతాపం...

సెయిల్ మాజీ చైర్మన్ పద్మవిభూషన్ వి. కృష్ణమూర్తి అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. 

Former Chairman of SAIL Padma Vibhushan V. Krishnamurthy dies, Rahul Gandhi mourns
Author
Hyderabad, First Published Jun 27, 2022, 12:18 PM IST

చెన్నై : బిజినెస్ వరల్డ్ లో విషాదం చోటుచేసుకుంది. మాజీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL),  మారుతి సుజుకి చైర్మన్  వి. కృష్ణమూర్తి కన్నుమూశారు. చెన్నై లోని తన నివాసంలో V. Krishnamurthy మరణించినట్లు సెయిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కృష్ణమూర్తి సెయిల్ లో 1985 నుంచి 1990 వరకు చైర్మన్ గా విధులు నిర్వహించారు. ‘పద్మ విభూషణ్ డాక్టర్ వెంకట కృష్ణ మూర్తి మరణం పట్ల కుటుంబం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందంటూ’ సెయిల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్మన్ పద్మవిభూషణ్ డాక్టర్ వీ కృష్ణమూర్తి మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.  ఆయన అసలు సిసలు జాతి నిర్మాత అని నివాళులర్పించారు. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయన అత్యంత విశిష్ట వ్యక్తి అని పేర్కొన్నారు. బిహెచ్ఈఎల్, maruti udyog, సెయిల్ ద్వారా   ఆయన ఘన వారసత్వ సజీవంగా  నిలుస్తుందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

Kerala: గంద‌ర‌గోళంగా కేర‌ళ అసెంబ్లీ సెష‌న్‌.. రాహుల్ గాంధీ ఆఫీసు దాడిపై స‌భ‌లో ర‌సాభాస !

సెయిల్ మాజీ చైర్మన్  వీ కృష్ణమూర్తి  భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కు చైర్మన్గా కూడా సేవలందించారు. ఆయన ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. డాక్టర్ వి కృష్ణమూర్తి మృతి పట్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఓ ట్వీట్ ద్వారా తీవ్ర సంతాపం తెలిపారు. ప్రభుత్వ రంగంలోని మేనేజర్లతో అసలు సిసలు లెజెండ్, బిహెచ్ ఈ ఎల్ ను  నిర్మించిన వ్యక్తి,   సెయిల్ ను గొప్ప మలుపు తిప్పిన వ్యక్తి, మారుతి ని ప్రారంభించిన వ్యక్తి ఇక లేరు అని పేర్కొన్నారు. 

ఆయన  గ్లోరియస్  ఇన్నింగ్స్  ఆడినప్పటికీ,  మూడేళ్ల ముందు  సెంచరీ మిస్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఆయన అత్యంత  ప్రముఖ స్థానంలో అన్నారు. సెయిల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం వి. కృష్ణమూర్తి 1985 నుంచి 1990 వరకు ఛైర్మన్ గా సేవలందించారు ఆయన అనేక ఇతర సంస్థలకు కూడా ఛైర్మెన్ గా వ్యవహరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios