సారాంశం

భారత ఎన్నికల సంఘం కమిషనర్ గా పనిచేసిన మనోహర్ సింగ్ గిల్ ఆదివారం కన్నుమూశారు. ఆయన 11వ సీఈసీగా 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ వరకు ఉన్నారు. 

న్యూఢిల్లీ :  ఆదివారం నాడు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ మనోహర్ సింగ్ గిల్ తన 86 వేట కన్నుమూశారు. ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మనోహర్ సింగ్ గెల్ కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు.  ఆదివారం నాడు ఆసుపత్రిలోనే మృతి చెందారు.  మనోహర్ సింగ్ గిల్ 1958 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్.11వ సీఈసీగా 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ వరకు సేవలు అందించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా 2008లో ఉన్నారు.  పంజాబ్లో ప్రకాష్ సింగ్ బాదల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ అధికారిగా పనిచేశారు.  మనోహర్ సింగ్ గిల్ కు  భార్య,  ముగ్గురు కుమార్తెలున్నారు. ఆదివారంనాడు మరణించిన గిల్  అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.  కేంద్ర ఎన్నికల సంఘం మాజీ సీఇసీ మనోహర్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. 12, 13 లోక్సభ ఎన్నికలకు విజయవంతంగా ఎన్నికల నిర్వహించారని  గుర్తు చేసుకుంది.  1998,  1999లో  12, 13 లోక్సభ ఎన్నికలు జరిగాయి.