Asianet News TeluguAsianet News Telugu

మూడేళ్ల బాలికపై 40యేళ్ల వ్యక్తి అత్యాచారం... తాతయ్యతో కలిసి దసరా వేడుకలు చూడడానికి వెడితే దారుణం..

దసరా సందర్భంగా ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని చూసేందుకు తాతయ్యతో కలిసి వెళ్లిందో మూడేళ్ల చిన్నారి. ఆ బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు.

A 40-year-old man raped a three-year-old girl in  Chhattisgarh - bsb
Author
First Published Oct 26, 2023, 11:04 AM IST

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మూడేళ్ల చిన్నారిపై 40యేళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కబీర్‌ధామ్ జిల్లాలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. తన తాతయ్యతో కలిసి ఆ చిన్నారి దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లింది. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు.

నిందితుడిని దుర్గేష్ పటేల్ (40)గా గుర్తించామని, అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కవార్ధా సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో బాధితురాలు తన తాతతో కలిసి దసరా సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లిందని కబీర్‌ధామ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ హరీష్ రాథోడ్ తెలిపారు.

దారుణం.. భోజనం విషయంలో గొడవపడి తల్లికి నిప్పంటించిన కొడుకు..

మైనర్ తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కార్యక్రమం జరుగుతుండగా.. చిన్నారి మంచినీళ్లు కావాలని అడగడంతో తాత నీళ్లు తేవడానికి దగ్గర్లో ఉన్న ఓ ఇంటికి వెళ్లాడు. తిరిగివచ్చేసరికి చిన్నారి కనిపించకుండా పోయింది. ఆ  ప్రదేశానికి దగ్గర్లోనే వారి ఇల్లు ఉంది. ఆ తరువాత చిన్నారిని వెతుకుతున్న క్రమంలో ఒక ఇంటి నుండి బాలిక ఏడుపులను విని అక్కడికి పరుగెత్తాడు. బాధితురాలిని ఓ వ్యక్తి ఒడిసిపట్టుకోవడం కనిపించిందని చెప్పినట్లు పోలీసు అధికారి తెలిపారు.

నిందితుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలిందని రాథోడ్ తెలిపారు. నిందితుడికి ఐపిసి సెక్షన్ 376 ఎబి (12 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం) , లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios