ఎల్‌వోసీకి అటువైపునా అంటే పాకిస్తాన్ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఎల్‌వోసీ గుండా ఉన్న అడవుల్లో వ్యాపించాయి. ఆ తర్వాత అవి భారత్‌వైపునా విస్తరించాయి. మెండర్ సెక్టార్‌లో పాకిస్తాన్ నుంచి ఈ మంటలు భారత్ వైపు వచ్చాయి. ఈ కార్చిచ్చు కారణంగా ఉగ్రవాదులను, అక్రమ చొరబాట్లను అరికట్టడానికి ఏర్పాటు చేసిన సుమారు అర డజను ల్యాండ్‌మైన్లు పేలిపోయాయి. 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న అడవుల్లో కార్చిచ్చు రాజుకుంది. ఈ కార్చిచ్చు కారణంగా సరిహద్దులో నాటిన ల్యాండ్‌ మైన్లు పేలిపోయాయి. జమ్ము కశ్మీర్ పూంచ్ జిల్లాలో ఎల్‌వోసీ సమీపంలో ఈ ల్యాండ్‌మైన్లు పేలినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. ఎల్‌వోసీకి అవతలి వైపున సోమవారం ఈ మంటలు మొదలైనట్టు తెలిసింది. ఆ తర్వాత మెండర్ సెక్టార్‌లో భారత్ వైపు విస్తరించినట్టు అధికారులు వివరించారు. 

అయితే, భారత్‌లోకి సరిహద్దు గుండా అక్రమంగా చొరబడే వారిని అడ్డుకోవడానికి జవాన్లు ల్యాండ్‌మైన్లు నాటారు. అక్రమంగా భారత్‌లోకి చొరబడకుండా ఈ ల్యాండ్‌ మైన్లు ఏర్పాటు చేశారు. అయితే, సరిహద్దు అడవుల్లో మొదలైన ఈ కార్చిచ్చు కారణంగా సుమారు అర డజను ల్యాండ్‌మైన్లు పేలిపోయినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ కార్చిచ్చు సుమారు మూడు రోజులుగా కొనసాగుతున్నది. ఆర్మీ సహకారం తీసుకుని ఈ కార్చిచ్చును ఆర్పే ప్రయత్నాలు చేశామని ఫారెస్టర్ కనర్ హుస్సేన్ షా తెలిపారు. అయితే, ఈ మంటలను అదుపులోకి తెచ్చామని వివరించారు. అయితే, ఈ రోజు ఉదయం ధర్మశాల బ్లాక్‌లో కూడా మంటలు చెలరేగాయని, బలంగా వీస్తున్న గాలుల ద్వారా ఈ మంటలు వేగంగా వ్యాపించాయని తెలిపారు. ఈ మంటలు వెంటనే బార్డర్ సమీపంలోని ఓ కుగ్రామానికీ విస్తరించాయని చెప్పారు. ఆర్మీ సహాయంతో ఈ మంటలను అదుపులోకి తెచ్చామని వివరించారు.

ఇదిలా ఉండగా, రాజౌరీ జిల్లా సుందర్‌బంది సమీంలో సరిహద్దులోనూ భారీగా మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అవి గంభీర్, నిక్కా, పంజ్‌గ్రయే, బ్రాహమన, మొఘల సహా ఇతర ప్రాంతాలకు విస్తరించాయని బుధవారం వివరించారు. అంతేకాదు, కాలకోటే లోని కలార్, రంథల్, చింగి అడవుల్లోనూ మంటలు వ్యాపించాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండానే ఈ కార్చిచ్చును అదుపులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. జమ్ము జిల్లా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో నూ మంటలు అంటుకున్నట్టు వివరించారు. అయితే, ఈ మంటలనూ ఆర్పేసినట్టు తెలిపారు.