Asianet News TeluguAsianet News Telugu

సుజనా పౌండేషన్ సీఈఓ ఏకే రావు మృతిపై సమాచారం లేదు: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్

సుజనా పౌండేషన్ సీఈఓ ఏకే రావు మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు.  ఈ విషయమై బెంగుళూరు పోలీసుల నుండి సమాచారం తెప్పించుకొని విచారణ చేస్తామన్నారు. 

Hyderabad CP Anjani kumar reacts on Sujana Foudation CEO AK Rao death
Author
Hyderabad, First Published Nov 25, 2021, 4:13 PM IST

హైదరాబాద్: సుజనా ఫౌండేషన్ సీఈఓ, ప్రముఖ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతిపై హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ స్పందించారు. ఏకే రావు కుటుంబం అదృశ్యమైనట్టుగా కూడా తమకు సమాచారం లేదన్నారు. ఈ విషయమై తమకు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని ఆయన తెలిపారు. బెంగుళూరు పోలీసుల నుండి కూడా తమకు సమాచారం లేదని Anajani kumar చెప్పారు..  ఈ విషయమై బెంగుళూరు పోలీసుల నుండి సమాచారం తెప్పించుకొని విచారణ  చేస్తామని Hyderabad CP తెలిపారు.

also read:సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి: బెంగుళూరులో డెడ్‌బాడీ లభ్యం

వారం రోజులుగా ప్రముఖ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యమైనట్టుగా సమాచారం. హైద్రాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే ఏకే రావు కుటుంబ సభ్యులు వరాం రోజులుగా కన్పించడం లేదని స్థానికులు తెలిపారు. అయితే  మూడు రోజుల క్రితం ఏకే రావు  బెంగుళూరులోని  రైల్వే ట్రాక్ పై అనుమానాస్పదస్థితిలో మరణించాడు. అయితే  తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహంపై ఉన్న గాయాల ఆధారంగా హత్య కేసుగా నమోదు చేశారు.  ఈ హత్యకు ముందు ఏకే రావు ఆర్ధిక వివాదానికి సంబంధించి పోలీసులకు  ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే ఈ ఫిర్యాదు  ఇచ్చిన  తర్వాత ఏకే రావు  మృతి చెందడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఏకే రావు మృతికి సంబంధించి బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ విషయమై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ స్పందించారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో విధులు నిర్వహించిన తర్వాత ఏకే రావు రిటైరయ్యారు.  ఉద్యోగ విరమణ తర్వాత ఆయన సుజనా పౌండేషన్ లో సీఈఓగా పనిచేస్తున్నారు. అయితే ఏకే రావుకు మరెవరితో ఆర్ధిక పరమైన లావాదేవీలు చోటు చేసుకొన్నాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఏకే రావు కుటుంసభ్యులు కూడా కన్పించకుండా పోయారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఈ విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏకే రావు మృతదేహం దొరికిన రైల్వే ట్రాక్ కు సమీపంలో చాకు, బ్లేడ్ లను పోలీసులు గుర్తించారు. ఏకే రావు ఎడమ చేయి, గొంతుపైనా తలపై గాయాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలంలో చాకు, బ్లేడును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  ఓ పని నిమిత్తం ఏకే రావు బెంగుళూరుకు వచ్చాడు. అయితే బెంగుభూరుకు వచ్చిన ఏకే రావు తన కొడుకు నివాసంలో ఉన్నాడు. అయితే ఏకే రావును ఎవరు హత్య చేశారనే విషయమై మిస్టరీగా ఉంది

పలు భాషల్లో పాటలు పాడిన హరిణి

సింగర్ హరిణి  గాయనితో పాటు డబ్బింగ్ ఆర్ఢిస్ట్ కూడా.  తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ సినిమాల్లో ఆమె సుమారు   3500 కు పైగా సినిమాల్లో  పాటలు పాడారు. ఆమె తమిళంలో ఎక్కువ పాటలు పాడారు.  మరో సింగర్ టిప్పుతో హరిణి వివాహమైంది.  తెలుగులో  మురారి , గుడుంబా శంకర్, ఘర్షణ, అల్లుడు శీను, సైనికుడు, 100 % లవ్, లెజెండ్, స్పైడర్,నిశ్శబ్దం  తదితర సినిమాల్లో ఆమె పాటలు పాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios