వరల్డ్ లెవెల్ ఎడ్యుకేషన్ దిశగా ఉత్తర ప్రదేశ్ ... యోగి సర్కార్ నిర్ణయాలు అదుర్స్

ఉత్తరప్రదేశ్‌లో మూడు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు, విదేశీ యూనివర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆమోదం లభించింది.  

Foreign University Campuses get approval for higher education in Uttar Pradesh AKP

లక్నో : ఉత్తరప్రదేశ్ శాసనసభ విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చే నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల ద్వారా రాష్ట్రంలో మూడు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు, విదేశీ యూనివర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా మార్చే దిశగా చేపడుతున్న చర్యల్లో ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. 

స్వరాష్ట్రంలోనే ప్రపంచ స్థాయి విద్య

ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ మాట్లాడుతూ... సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉన్నత విద్యారంగంలో ఈ సంస్కరణలు రాష్ట్ర ప్రతిష్టను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెంచుతాయని అన్నారు. కొత్త యూనివర్సిటీలు, విదేశీ క్యాంపస్‌ల ద్వారా విద్యార్థులకు స్వరాష్ట్రంలోనే ప్రపంచ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. విదేశీ యూనివర్సిటీలు రావడంతో రాష్ట్ర విద్యార్థులు ఇక బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఉన్నత స్థాయి విద్య స్వరాష్ట్రంలోనే చవకగా, సులభంగా లభిస్తుందని పేర్కొన్నారు. 

ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన సంస్థలే ఇక్కడ యూనివర్సిటీలు స్థాపించేవి... కానీ కొత్త సవరణ బిల్లు ద్వారా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన సంస్థలు, కంపెనీలు, ట్రస్టులు కూడా యూపీలో ప్రైవేట్ యూనివర్సిటీలు తెరవడానికి అర్హత సాధిస్తాయన్నారు. యూజీసీ గుర్తింపు పొంది, యూపీ ఆమోదించిన విదేశీ యూనివర్సిటీలు కూడా ఇక్కడ యూనివర్సిటీలు స్థాపించవచ్చని మంత్రి తెలిపారు.

ఈ బిల్లులు రాష్ట్ర విద్యార్థులకు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తాయన్నారు. యోగి ప్రభుత్వ చర్యలు యూపీని విద్యా కేంద్రంగా మార్చడమే కాకుండా స్థానిక, ప్రపంచ స్థాయిలో ఉద్యోగ, పరిశోధనా అవకాశాలను కూడా పెంచుతుందన్నారు. ఈ మార్పు కేవలం కొత్త యూనివర్సిటీలకే పరిమితం కాదు. రాష్ట్రంలో విద్య నాణ్యతను మెరుగుపరిచి, అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావడానికి కూడా కృషి చేస్తుందని మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ అన్నారు..

నాణ్యమైన విద్య 

రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం 2019 (ఉత్తరప్రదేశ్ చట్టం నంబర్ 12, 2019)లో సవరణలు చేశారు. దీని ప్రకారం విద్యా యూనివర్సిటీ మీరట్, వివేక్ యూనివర్సిటీ బిజ్నోర్, చండీగఢ్ యూనివర్సిటీ ఉన్నావ్ అనే కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధి, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios