Asianet News TeluguAsianet News Telugu

నితీష్ కుమార్‌కు లాలూజీ బుద్ధి చెబుతాడు: బీజేపీ విమర్శలు.. 2024 చాలెంజ్ విసిరిన జేడీయూ

బీజేపీ, జేడీయూల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మణిపూర్‌లో జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూ లేకుండా పోయిందని, ఇప్పుడు మణిపూర్‌లోనూ కనుమరుగు అవుతుందని, బిహార్‌లో లాలూజీ.. నితీష్ కుమార్‌కు బుద్ధి చెబుతాడని బీజేపీ విమర్శించింది. జేడీయూ ఎదురుదాడికి దిగుతూ 2024 చాలెంజ్ విసిరింది.

war of words between bjp and jdu continueing as jdu leaders went into bjp
Author
First Published Sep 3, 2022, 1:15 PM IST

న్యూఢిల్లీ: బీజేపీకి షాక్ ఇవ్వాలని భావించిన జేడీయూనే భంగపడింది. బీహార్‌లో బీజేపీ కూటమికి స్వస్తి పలికి ఆర్జేడీతో దోస్తీ కట్టి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా మణిపూర్‌లోనూ బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించాలనే ఆలోచనలు చేసింది. కానీ, ఇంతలోనే బీజేపీ చక్రం తిప్పింది. జేడీయూలోని ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతులకు పైగా మంది పార్టీ మారడంతో ఫిరాయింపు చట్టం నుంచి వీరు మినహాయింపు పొందుతున్నారు. వారి పార్టీ మార్పు సక్రమంగానే నిలబడింది. పార్టీ మార్పు శుక్రవారం జరిగినా.. అందుకు సంబంధించిన ప్రకంపనలు శనివారం వెలుగు చూశాయి. ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలతో దాడి చేసుకున్నారు.

బీజేపీ ఎంపీ, దీర్ఘకాలం సీఎం నితీష్ కుమార్ డిప్యూటీగా చేసిన సుశీల్ కుమార్ మోడీ నిన్న జేడీయూపై విమర్శలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఇప్పుడు మణిపూర్‌లోనూ జేడీయూ కూడా తుడిచేసుకుపోయిందని విమర్శించారు. త్వరలోనే బిహార్‌లోనూ లాలూజీ.. జేడీయూ రహితం చేస్తారని ఆరోపణలు చేశారు. 

ఈ ఆరోపణలపై జేడీయూ ఈ రోజు ఘాటుగా స్పందించింది. నితీష్ కుమార్ సన్నిహితుడు, జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ బీజేపీపై ఎదురుదాడికి దిగారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌లలో బీజేపీని ఓడించే జేడీయూ సీట్లు గెలుచుకుందనే విషయాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నట్టు చురకలు అంటించారు. కాబట్టి, జేడీయూ నుంచి విముక్తి పొందినట్టుగా పగటి కలలు కనొద్దని వివరించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ కూటమి నీతిని పాటించలేదని ఆరోపించారు. మరో ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. 

మణిపూర్‌లో బీజేపీ నైతిక విధానం ఇప్పుడు అందరి కళ్ల ముందే ఉన్నదని రాజీవ్ రంజన్ సింగ్ పేర్కొన్నారు. 2015లో ప్రధాని మోడీ 42 మీటింగ్‌లు పెడితే కేవలం 53 సీట్లను బీజేపీ గెలుచుకోలేకపోయిందని ఆరోపణలు సంధించారు. 2024 తర్వాత దేశం అసత్యపు హామీలు ఇచ్చే పార్టీ నుంచి విముక్తి చెందుతుంని వివరించారు. కొంచెం వేయి చూడాలని తెలిపారు. మొత్తంగా 2024 చాలెంజ్‌ను బీజేపీకి జేడీయూ పార్టీ విసిరింది. సీఎం నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనే వాదనలు ఊపందుకుంటున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios