సారాంశం
పాఠశాలలో బాలికలు హిజాబ్ ధరించమని బలవంతం చేశారని ఆరోపిస్తూ.. ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిమీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్ బోర్డు పరీక్షలో తమ స్కూలు టాపర్‌ల పోస్టర్‌ను విడుదల చేసింది, అందులో ముస్లింలు కాని కొంతమంది బాలికలు స్కార్ప్స్ కట్టుకుని కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని బలవంతం చేశారని ఆరోపిస్తూ.. ఈ మేరకు ఆ పోస్టర్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది.
ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్ఎస్ సిసిఆర్) చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో తదనంతరం దామోహ్ జిల్లా కలెక్టర్‌కు తెలిపారు.మే 30న తమకు ఎన్‌సిపిసిఆర్ ఫిర్యాదు వచ్చిందని, దామోహ్ జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల కుటుంబాలను కలిశారని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే, దీనిమీద తల్లిదండ్రులెవరూ ఫిర్యాదు చేయలేదని అధికారి తెలిపారు.
పస్మాండా ముస్లింపై విదేశీ పాలకులు, ఉలేమాలు, సయ్యద్ ల ప్రభావం.. చరిత్ర ఏం చెబుతోందంటే..?
"అమ్మాయిల స్కూల్ డ్రెస్ కోడ్‌లో స్కార్ఫ్ లు, సల్వార్, కుర్తా ఉంటాయి. ఏ రోజైనా స్కార్ఫ్ ధరించడం మర్చిపోయినా, పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వరు. అందువల్ల మాకు ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు," అని ఒక విద్యార్థి అన్నారు. గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ ముస్లిమేతర బాలికలను హిజాబ్ ధరించమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ వీహెచ్ పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ సహా మితవాద సంఘాలు దామోహ్‌లో నిరసన తెలిపాయి.
"అమ్మాయిలు హిజాబ్ ధరించలేదు, బదులుగా స్కార్ఫ్‌లు ధరించారు, ఇది పాఠశాల దుస్తుల కోడ్‌లో భాగం. హిజాబ్ మొత్తం శరీరాన్ని కప్పివేస్తుంది, స్కార్ఫ్ ఛాతీ వరకు మాత్రమే కప్పబడుతుంది. మేము ఏ విద్యార్థినీ వారి సంప్రదాయాలు, సంస్కృతులకు వ్యతిరేకంగా ఏదైనా ధరించమని బలవంతం చేయలేదు" అని పాఠశాల డైరెక్టర్ ముస్తాక్ మహ్మద్ తెలిపారు.
దీనిపై విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. "ఇప్పటికీ మేము ఈ విషయంపై లోతైన విచారణ కోసం దామోహ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కోరాం" అని మిశ్రా చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా విచారణకు ఆదేశించారు.
"విద్యార్థి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా లేని దుస్తులు ధరించమని ఏ పాఠశాల కూడా ఏ అమ్మాయినీ బలవంతం చేయదు. దామోహ్ ఆధారిత పాఠశాల విషయం నా దృష్టికి వచ్చింది, ఆ తర్వాత నేను స్థానిక పరిపాలనను క్షుణ్ణంగా ఆదేశించాను. విచారణలో కనుగొనబడిన వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయి" అని చౌహాన్ చెప్పారు.