Asianet News TeluguAsianet News Telugu

Forbes: ప్రపంచంలో శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ స‌హా ఆరుగురు భార‌త మ‌హిళ‌లు

New Delhi: ప్ర‌పంచంలో శ‌క్తివంత‌మైన మ‌హిళ‌ల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్ చోటుద‌క్కించుకున్నారు. 36వ స్థానంలో నిలిచిన సీతారామన్ వరుసగా నాలుగోసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2021 లో 37 వ స్థానంలో ఉండగా, 2020 లో 41 వ స్థానంలో, 2019 లో 34 వ స్థానంలో ఉన్నారు.
 

Forbes : Six Indian women including Nirmala Sitharaman in the list of most powerful women in the world
Author
First Published Dec 8, 2022, 12:12 AM IST

Forbes Most Powerful Women: ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్-షా, నైకా వ్యవస్థాపకులు ఫాల్గుణి నాయర్ లు చోటుద‌క్కించుకున్నారు. 36వ స్థానంలో నిలిచిన సీతారామన్ వరుసగా నాలుగోసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2021 లో 37 వ స్థానంలో ఉండగా, 2020 లో 41 వ స్థానంలో, 2019 లో 34 వ స్థానంలో ఉన్నారు. అలాగే, హెచ్ సీఎల్ టెక్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా (53 స్థానం), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్ పర్సన్ మధాబి పూరి బుచ్ (54 స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ సోమా మొండల్ (67 స్థానం) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మల్హోత్రా, మజుందార్ షా, ఫాల్గుణి నాయర్ లు వరుసగా 52, 72, 88వ స్థానాల్లో నిలిచారు.

ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళల వీరే.. 

  1. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగోసారి ఫోర్బ్స్ జాబితాలో చోటుద‌క్కించుకున్నారు. 36వ స్థానంలో నిలిచారు.
  2. హెచ్ సీఎల్ టెక్ చైర్ ప‌ర్స‌న్ రోషిణి నాడార్ మల్హోత్రా 53వ స్థానంలో నిలిచారు.
  3. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్ పర్సన్ మాధాబి పూరి బుచ్ ఈ జాబితాలో 54వ స్థానంలో ఉన్నారు.
  4. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సోమ మొండల్ కు 67వ స్థానం దక్కింది.
  5. బయోకాన్ లిమిటెడ్, బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ మజుందార్ షా 72వ స్థానంలో నిలిచారు.
  6. బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ రిటైల్ కంపెనీ నైకా వ్యవస్థాపకుడు, సీఈవో ఫాల్గుణి సంజయ్ నాయర్ 89వ స్థానంలో నిలిచారు.

ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 39 మంది సీఈవోలు ఉన్నారు. 10 దేశాల అధిపతులు, మొత్తం 115 బిలియన్ డాలర్ల విలువైన 11 మంది బిలియనీర్లు ఉన్నారు. "ఈ జాబితాను నాలుగు ప్రధాన కొలమానాల ద్వారా నిర్ణయించారు.. డబ్బు, మీడియా, ప్రభావం, ఆయా రంగాల్లో వారి ప్ర‌భావం. రాజకీయ నాయకులకు, మేము స్థూల దేశీయ ఉత్పత్తులు, జనాభాను తూకం వేశాం. కార్పొరేట్ నాయకులు, ఆదాయాలు, ఉద్యోగుల గణన వంటి అంశాల‌ను ఉన్నాయి. మీడియాలో  అందరి ప్రస్తావనలు, వారి రీచ్ ల‌ను తెలియజేస్తుంది" అని ఫోర్బ్స్ పేర్కొంది.

యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 19వ వార్షిక ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో ఉండగా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. 100వ ర్యాంక్‌లో ఇరాన్‌కు చెందిన జినా మహ్సా అమిని మరణానంతరం ప్రభావవంతమైన మ‌హిళ‌ల‌ జాబితాలో చోటుదక్కించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios