Asianet News TeluguAsianet News Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీతోపాటు ఆ బస్‌లో ప్రయాణించాలనుకుంటున్నారా? ఇలా ప్రయత్నించండి

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో ఆయనతోపాటే బస్సులో ప్రయాణించాలంటే స్పెషల్ టికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ లీడర్ జైరాం రమేశ్ ఎక్స్‌లో వెల్లడించారు. 
 

for travelling with rahul gandhi in mohabbat ki dukaan bus in bharat jodo nyay yatra, needs special ticket kms
Author
First Published Jan 16, 2024, 1:44 PM IST

Bharat Jodo: భారత్ జోడో న్యాయ్ యాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. 15 రాష్ట్రాల మీదుగా 6,700 కిలోమీటర్ల దూరం ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తారు. రెండున్నర నెలలపాటు ఈ యాత్ర సాగుతుంది. ఇందుకు రాహుల్ గాంధీ కోసం తెలంగాణ నుంచి ఓ వోల్వో బస్ పంపించారు. ఈ బస్సులోనే రాహుల్ గాంధీ ప్రయాణిస్తారు. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీతో ప్రయాణించడానికి, దేశంలోని సమస్యలు మాట్లాడటానికి ఓ స్పెషల్ టికెట్‌ను ప్రవేశపెట్టింది. రాహుల్ గాంధీతో ప్రయాణించి, సమస్యలపై మాట్లాడటానికి ఈ స్పెషల్ టికెట్ తప్పకుండా తీసుకోవాలి. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ స్వయంగా పోస్టు చేశారు. 

‘భారత్ జోడో న్యాయ్ యాత్రలో మొహబ్బత్ కి దుకాన్ బస్సులో ప్రయాణించడానికి కావాల్సిన టికెట్ ఇదే. ఈ పదేళ్లలో జరిగిన అన్యాయాలపై, న్యాయం గురించి, సమస్యల గురించి రాహుల్ గాంధీని కలిసి మాట్లాడదలచిని వారికి ఈ టికెట్ ఇచ్చారు. బస్సులోకి రమ్మన్నారు.’ అని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

Also Read : Explained: మన బలగాలను మాల్దీవులు ఎందుకు వెనక్కి పంపించాలని అనుకుంటున్నది? చైనా పాత్ర ఏమిటీ?

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను జనవరి 14వ తేదీన మణిపూర్‌లో  ప్రారంభించారు. ఫస్ట్ ఎడిషన్ భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు రాహుల్ గాంధీ చేపట్టారు. ఫస్ట్ ఎడిషన్ యాత్రలో రాహుల్ గాంధీ పూర్తిగా పాదయాత్రనే చేశారు. ఈ సారి మాత్రం పాదయాత్ర ఉంటుంది, బస్సులో ప్రయాణమూ ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios