Asianet News TeluguAsianet News Telugu

మాకు ఓటేసే ప్రతీ ఓటరుకు రూ. 6 వేలు ఇస్తాం - కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి బహిరంగ ప్రకటన

తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసే ఓటరకు రూ.6 వేలు అందిస్తామని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి అన్నారు. తమ ప్రత్యర్థి అభ్యర్థి రూ.3 వేల విలువైన వస్తువులను అందిస్తున్నారని, కానీ తాము నేరుగా నగదును అందజేస్తామని పేర్కొన్నారు. 

For every voter who votes for us, Rs. We will give 6 thousand - Karnataka BJP MLA Ramesh Jarkiholi's public statement
Author
First Published Jan 22, 2023, 4:57 PM IST

తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసే ప్రతీ ఓటరుకు రూ.6 వేలు అందజేస్తానని కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి ప్రకటించారు. దీనిని ఆయన బహిరంగ వేధికలో ప్రకటించి వివాదంలో చిక్కుకున్నారు. తమ ప్రత్యర్థి రూ.3 వేల విలువైన వస్తువులు అందజేస్తున్నారని, కానీ తాను వస్తువులు ఇవ్వకుండా నేరుగా నగదునే అందిస్తామని అన్నారు. బెలగావిలోని సులేభవి గ్రామంలో శుక్రవారం రాత్రి అభిమణి బాలగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సభలోనే ఆయన ఈ వివాదస్పద ప్రకటన చేశారు.

కలవరం పెడుతున్న చాయ్ అమ్ముకునే వ్యక్తి ఆత్మహత్య.. తొలుత కొవిడ్, తర్వాత బుల్‌డోజర్ దెబ్బతో విలవిల్లాడి.. !

“మా ప్రత్యర్థి అభ్యర్థి హోల్‌సేల్ మార్కెట్‌లో రూ. 70 ఖరీదు చేసే టిఫిన్ బాక్స్‌లు, రూ. 700 ప్రెషర్ కుక్కర్‌ని ఇస్తున్నారు. ఆమె ఇంకా ఎక్కువే ఇవ్వవచ్చు. కానీ మొత్తంగా ఆమె రూ. 3,000 బహుమతులు ఇవ్వవచ్చు. అయితే మేము ఇప్పుడు ఎలాంటి బహుమతులు ఇవ్వడం లేదు. కేవలం ఓటర్ల మానసిక స్థితిని పరీక్షిస్తోంది. కానీ నేడు ఇక్కడ ఉన్న ప్రేక్షకులను చూస్తే.. మేము ఆమె కంటే రెట్టింపు ఇవ్వగలమనే నమ్మకంతో ఉన్నాము. మీకు రూ.6వేలు పంపకపోతే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయొద్దు’’ అని జార్కిహోళి అన్నారు.

కొందరు సుప్రీంకోర్టు కంటే బీబీసీయే ఎక్కువని భావిస్తారు - ప్రతిపక్షాలపై కిరెన్ రిజిజు ఆగ్రహం

‘‘ఆ పురుగు పోవాలి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆమె తరఫున ప్రచారం చేసి గెలిపించాను. ఈసారి ఎలాగైనా ఆ సంఘ విద్రోహ అంశాన్ని మార్చాలి. గత ఐదేళ్లలో ఆమె తనను తాను అభివృద్ధి చేసుకుంది. గత కొన్నేళ్లలో రోడ్ల పక్కన ఎన్ని క్లబ్బులు, వైన్ షాపులు తెరిచారో మీరు చూడవచ్చు’’ అని ప్రత్యర్థి అభ్యర్థి హెబ్బాళ్కర్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. 

జ్యూడీషియరీ వర్సెస్ కేంద్రం: ఏది సవ్యమైనదంటే.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి లేటెస్ట్ కామెంట్ ఇదే

జార్కిహోళి గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బెళగావి పరిధిలోకి వచ్చే గోకాక్ నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల కోసం బెళగావి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఆయన అనుచరుడైన నగేష్ మన్నోల్కర్ కు టికెట్ ఇచ్చింది. ఆయనను గెలిపించుకునేందుకు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీ హెబ్బాల్కర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

పఠాన్ సినిమాపై ఆందోళనలు:అసోం సీఎం బిశ్వశర్మకు బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఫోన్

తన అనుచరుడి గెలుపు కోసం ఆయన పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సభలోనే రమేష్ జార్కిహోళి ఈ వివాదస్పద ప్రకటన చేశారు. ఈ విషయంలో మంత్రి గోవింద్ కార్జోల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది పార్టీ ప్రకటన కాదని అన్నారు. ఆ ప్రకటనతో పార్టీకి సంబంధం లేదని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios