పోలీసు వాహనానికి తగిలిందని, ఓ ఫుట్ బాల్ ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నేరం చేసిన వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం చాలా సహజం. ఇప్పటి వరకు పోలీసులు చాలా మంది నేరస్థులను అలా కస్టడీలోకి తీసుకొని ఉంటారు. అయితే, మీరు వినే ఉంటారు కొన్నిసార్లు జంతువులను కూడా పలు కారణాల వల్ల పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఉంటారు. అయితే, ఒక ఫుట్ బాల్ ని అరెస్టు చేయడం ఎప్పుడైనా విన్నారా? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. పోలీసు వాహనానికి తగిలిందని, ఓ ఫుట్ బాల్ ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎర్నాకులంలోని నెట్టూర్‌లోని మైదానంలో పిల్లలు ఆడుతుండగా పోలీసు జీప్‌ను ఢీకొట్టింది. దీంతో వారు ఫుట్‌బాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ బాల్ తో అసురక్షితంగా ఆడుతున్నారని వారు కారణం చెప్పారు. అయితే, అలా ఆడుతున్నందుకు పిల్లలను కాకుండా, బాల్ ని వారు కస్టడీలోకి తీసుకోవడం విశేషం. గత శుక్రవారం నెట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని మైదానంలో చిన్నారులు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది.
ఆ సమయంలో పోలీసులు వాహనాల తనిఖీకి వచ్చి తమ జీపును అక్కడికి దగ్గరలో పార్క్ చేశారు. అయితే, తాము ఆడుకుంటు ఉంటే బంతి జీపుకు తగిలే ప్రమాదం ఉందని చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో, పిల్లలు ఆడుకోవడం మొదలుపెట్టారు.
ఆట జరుగుతున్న సమయంలో బంతి పోలీసు జీపు కిటికీకి తగలడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కోపోద్రిక్తులైన పోలీసు అధికారులు ఆటను నిలిపివేసి ఫుట్‌బాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నెట్టూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసు బృందం అవసరమైన చర్యలు చేపట్టింది. మైదానంలో ఆడుకుంటున్న చిన్నారులు నిరసన వ్యక్తం చేసినా, పోలీసులు బంతిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. ఫుట్‌బాల్‌కు సంబంధించి పోలీసులకు, పిల్లలకు మధ్య జరిగిన ఘర్షణ వీడియోను స్థానికులు రికార్డ్ చేశారు, వారు దానిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ ఘటన వైరల్‌గా మారింది.
బాటసారులకు భద్రత లేని విధంగా పిల్లలు ఫుట్‌బాల్ ఆడుతున్నారని, అందుకే బాల్ తీసుకున్నామని పోలీసులు సమర్థించుకోవడం విశేషం. పిల్లలు తమ తప్పును తెలుసుకునేందుకే బంతిని తీసుకెళ్లామని పోలీసులు పేర్కొన్నారు.
