మణిపూర్ ఘటనలపై ప్రత్యేక దృష్టి.. ఆరువేల కేసులు నమోదు : ప్రభుత్వ వర్గాలు
మణిపూర్ ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియాపై, ఫేక్ న్యూస్ వ్యాప్తిపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టింది. ఇప్పటివరకు ఇలా 6వే కేసులు నమోదు చేసింది.

న్యూఢిల్లీ : జాతి ఘర్షణల మధ్య మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేసి, నగ్నంగా ఊరేగించిన వీడియోపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలు, భద్రతా దళాలు రాష్ట్రంలో జరిగిన అన్ని సంఘటనలపై నిఘా తీవ్రం చేశాయని అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.
మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణల తర్వాత, ఈ ఏజెన్సీలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై తమ నిఘాను కఠినతరం చేశాయి. ఇప్పటి వరకు 6,000కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం, నాశనం చేయడం వంటి వాటికి సంబంధించినవే.
ఢిల్లీలో మరోసారి ప్రమాదస్థాయిని దాటిన యమునా నీటిమట్టం..
"ఇలాంటి ఘటనల మీద మా పర్యవేక్షణను పెంచడం ద్వారా దేశ వ్యాప్తంగా తీవ్ర నష్టకరమైన ఘటనలు చెలరేగకముందే.. వాటిని తొలగించడంలో విజయం సాధించాం" అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. మణిపూర్‌లో జరిగిన సంఘటనల పరంపరను ఎక్కువగా చూపిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడం ఈ వ్యూహం లక్ష్యం. వీటిమీద చర్య తీసుకునే ముందు ఫుటేజ్ ప్రామాణికత క్రాస్-వెరిఫై చేయబడుతుంది.
మణిపూర్ లో చెలరేగిన హింస, గందరగోళ పరిస్థితుల మధ్య.. ఇప్పటికే తక్కువ స్టాప్, వనరుల కొరతలతో సతమతమవుతున్న స్థానిక పోలీసు స్టేషన్‌లలో హత్యలు, దాడి వంటి తీవ్రమైన నేరాల దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తుంది. ప్రస్తుతం శాంతిభద్రతలను నిర్వహించడమే ప్రధానంగా మారింది" అని సమాచారం.
ఈ సమస్యలను పరిష్కరించడానికి, శాంతిభద్రతల సమస్యలను ఎదుర్కోవడంలో రాష్ట్ర పోలీసులకు సహాయం చేయడానికి కేంద్రం 135 కంపెనీలను పంపించింది. ఇప్పటికీ ఇంకా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నప్పటికీ.. పరిస్థితి అదుపులోకి వస్తోంది.
ఒక అధికారి మాట్లాడుతూ.. "మణిపూర్‌లోని 16 జిల్లాలలో సగం ఇప్పటికీ సమస్యాత్మకంగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి బలగాలను రొటేషన్ మీద వాడుతున్నాం" అన్నారు.
మణిపూర్‌లో కుకీ గిరిజన సమూహం, మెజారిటీ మెయిటీ మధ్య హింసాత్మక జాతి ఘర్షణలతో ఈ గొడవలు ప్రారంభమయ్యాయి. ఇది కనీసం 125 మంది మరణాలకు దారితీసింది. 40,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. పార్లమెంటులో తీవ్ర ఇబ్బంది కలిగించింది.
వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ, ఆర్మీ దళాలను ఈ ప్రాంతంలో మోహరించింది. అయితే అక్కడక్కడ ఇంకా కొనసాగుతున్న హింస రాష్ట్రంలో ఇంకా హైఅలర్ట్ లోనే ఉంచింది.