ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరోసారి ఆఫర్ల బొనాంజాతో వినియోగదారుల ముందుకు వచ్చింది. సూపర్ వాల్యూ వీక్ పేరిట స్పెషల్ ఆన్‌లైన్ సేల్ ని ఈ రోజు నుంచి ప్రారంభించింది. ఈ నెల 24వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు మొబైల్ ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు లభిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్ సేల్‌లో అనేక ప్రొడక్ట్స్‌పై నో కాస్ట్ ఈఎంఐ, బైబ్యాక్ గ్యారంటీ, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తున్నారు. గూగుల్ పిక్సల్ 2 (128జీబీ) ఫోన్‌పై రూ.199కే బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్‌ను ఇస్తున్నారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు రూ.42వేల వరకు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

ఈ సేల్‌లో భాగంగా మోటో ఎక్స్4 ఫోన్‌పై రూ.6,999 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే రూ.199 కి బై బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ.16వేల వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఆఫర్‌ను ఇస్తున్నారు. ఇవే కాకుండా మోటో జీ6 ప్లే, మోటో జడ్2 ఫోర్స్, రెడ్‌మీ నోట్ 5 ఫోన్లపై కూడా ఇదే తరహాలో ఆఫర్లను అందిస్తున్నారు.