యూకేలో కరోనా కొత్త రకం వైరస్ కారణంగా బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై ఇండియా నిషేధం విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ నిషేధం అమమల్లో ఉంటుందని కేంద్ర పౌర విమానాయానశాఖ ప్రకటించింది.

 


యూకేలో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ఇండియా అప్రమత్తమైంది. ఇప్పటికే పలు దేశాలు ఈ విషయమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నాయి.

డిసెంబర్ 22 వ తేదీ రాత్రి నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై నిషేధం విధించినట్టుగా పౌర విమానాయానశాఖ సోమవారం నాడు మధ్యాహ్నం ప్రకటించింది. ఇప్పటికే కొన్ని దేశాలు విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

బ్రిటన్ నుండి వచ్చే విమానాలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఉదయమే కేంద్రాన్ని కోరారు. బ్రిటన్ లో కరోనా రెండో రకం వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆయన కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.